కుమారుని పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగుల కేంద్రం లో జరుపుతున్నమునగాల SI ప్రవీణ్ కుమార్
మునగాల 10 ఆగస్ట్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- పుట్టినరోజు వేడుకల సందర్భంగా వృధా ఖర్చుల కన్నా పేదలకు అన్నదానంతోనే ఆత్మసంతృప్తి...
వేడుకల సందర్భంగా వృధా ఖర్చులు చేసే దానికన్నా పేదలకు అభాగ్యులకు అన్నదానాలు , ఆర్థిక సహాయం చేయడం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు శనివారం కోదాడ శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రంలో తన రెండవ కుమారుడు భైరవ రుద్ర పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించి మానసిక వికలాంగుల పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శనగల జగన్మోహన్రావు మాట్లాడుతూ ఎస్సై ప్రవీణ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని మానసిక వికలాంగుల కు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు