కోదాడ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం.
ఆగస్టు 10: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగ కేంద్రంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో రెండవ కుమారుడు భైరవ రుద్ర పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మానసిక వికలాంగులు ,అనాధ పిల్లలు ,వృద్దులు లకు సేవ చేయడం ఎంతో పుణ్యం అన్నారు. మనం జరుపుకునే జన్మదిన కార్యక్రమాలు, మ్యారేజ్ డేలు ఇలాంటివి వీరి మధ్యన జరుపుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని, వీరికి ప్రత్యక్షంగా సేవ చేసినట్టు అవుతుందని అన్నారు. అన్నదానo మహా గొప్పదానం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, ఎటువంటి ఆధారం లేనటువంటి వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది, పుణ్యకార్యం అన్నారు. వేడుకల సందర్భంగా వృధా ఖర్చుల కన్నా పేదలకు అన్నదానంతోనే ఆత్మసంతృప్తి చెందుతుందని అన్నారు. వేడుకల సందర్భంగా వృధా ఖర్చులు చేసే దానికన్నా పేదలకు అభాగ్యులకు అన్నదానాలు , ఆర్థిక సహాయం చేయడం సంతృప్తిని కలిగిస్తుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు .ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ,ఎస్సై ప్రవీణ్ కుమార్ తన కుమారుడు పుట్టినరోజు మానసిక వికలాంగుల కేంద్రాల్లో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.