ఈనెల 21న జరిగే టీఎంజేఎఫ్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలి
తుంగతుర్తి:ఆగష్టు 10 తెలంగాణ వార్త ప్రతినిధి:- సభ కరపత్రాలను ఆవిష్కరించిన టీఎంజేఎఫ్ నాయకులు...
సమాజంలో ఇప్పటికీ దళిత జర్నలిస్టుల పట్ల వివక్షత కొనసాగుతుంది...
తుంగతుర్తి:- ఈనెల 21న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ కోరారు. శనివారం మండల కేంద్రంలో సభ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. నిత్యం సమస్యల వలయంలో చిక్కుకొని మెరుగైన సమాజం కోసం మాత్రం వార్తల రాస్తూనే ఉండేవారు జర్నలిస్టులని, అలాంటి జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని, అందులో దళిత జర్నలిస్టులపై ఎక్కువగా జరుగుతున్నాయని, గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, సమాజంలో ఇప్పటికీ దళిత జర్నలిస్టుల పట్ల వివక్షత కొనసాగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం కేటాయించడంతోపాటు అక్రిడేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇట్టి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దనసరి సీతక్క, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని మాదిగ, మాదిగ ఉపకులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టులు కొండగడుపుల ఎల్లయ్య, కొండగడుపుల లక్ష్మణ్, జెర్రిపోతుల రాంకుమార్,పోలెపాక రామచంద్రు,మచ్చ నర్సయ్య, బొంకూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.