అంగన్ వాడి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల 7 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం విద్యార్థులకు ఎమ్మెల్యే స్కూల్ యూనిఫామ్, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా పౌష్టిక ఆహార లోపంను నివారించేందుకు వివిధ పౌష్టిక ఆహారంను అందించడం జరుగుతున్నది. కావున గ్రామంలోని కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి కేంద్రం కు వచ్చే పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.