తెలంగాణలో పెరగనున్న వాహనాల ధరలు
-- మార్చి 1వ తేది నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుండి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు
తెలంగాణలో మార్చి 1వ తేదీ నుండి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ పన్నుతో ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుండి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ