రైతు భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సామేల్
అడ్డగూడూరు13 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన యువ రైతు చల్ల సోమేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరైన రైతు జీవిత భీమా చెక్కును సోమవారం భోగి రోజున తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా సోమేశ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండదండగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు చిత్తలూరి సోమయ్య గౌడ్,జిల్లా నాయకులు పాశo సత్యనారాయణ,సింగిల్విండో డైరెక్టర్ వేముల భిక్షం గౌడ్,గూడ శ్రీనివాస్ గౌడ్, తోట వెంకన్న,శీల వెంకన్న,చంద్రమౌళి,చిప్పలపల్లి గిరిబాబు,ముద్రబోయిన లచ్చయ్య,లింగయ్య,మందుల బిక్షం,మందుల యాదగిరి,సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు