పర్యాటకుల పై దాడి అమానుష చర్య

టెర్రలిస్టుల నిర్మూలన కు కేంద్రం చర్యలు తీసుకోవాలి.
జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్.
(సూర్యాపేట టౌన్ ఏప్రిల్ 26) జమ్మూ కాశ్మీర్ పహాల్గ లో పర్యాటకులపై టెర్రరిస్టుల చేసిన దాడి అమానూష చర్య అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించిన పంతంగి వీరస్వామి గౌడ్ టెర్రరిస్టుల దాడులను యావత్ ప్రజానీకం ప్రజాస్వామిక వాదులందరూ ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాలని కోరినారు . ఉగ్రవాదులు తమ ఉనికి కోసం ఇలాంటి హింసత్మక దాడులు చేయడం సమంజసం కాదని ఇలాంటి దృశ్చర్యలు చేయడం సరికాదన్నారు. టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలనీ కేంద్రాన్ని కోరారు. జమ్ము కాశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ ఐతగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టేటికిరణ్ సార గండ్ల కోటేష్ గిరీశం మహేష్ తదితరులు పాల్గొన్నారు.