కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించడం బాధ్యతగల కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం
ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే మహాత్మా గాంధీ కి సంబంధం ఏమిటి?* కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సూటి ప్రశ్న.
***********
----వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచవ్యాప్తంగా ఏమో కానీ భారతదేశంలో మాత్రం పనిచేసేది ఒకరు ఫలితం అనుభవించేది మరొకరు అనే సామెత అన్ని రంగాల్లో స్పష్టంగా చూడవచ్చు. అందుకే సొమ్ము ఒకడిది సోకొకడిది అనే సామెత ప్రభలంగా ప్రజల నాలుకల పైన ఉన్నది అందుకు కరెన్సీ నోట్లపైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అనాదిగా చేస్తున్న డిమాండ్ ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధంలేని గాంధీ బొమ్మను ముద్రించడం అంటే సొమ్ము ఒకడిది సోకొకడిది అన్నట్లే కదా!. ప్రధానంగా స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధ పోరాటం భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి విరోచిత సాహస నేపథ్యం కలిగిన స్వాతంత్ర సమరయోధుల నాయకత్వంలో జరిగిన పోరాటం చివరికి వాళ్ళ బలిదానం చూస్తే వారికి చరిత్రలో ఉన్న స్థానం ఎంత? అయినా ఎంతో చిన్న వయసులో ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు స్థానాన్ని ప్రజల నిలబెట్టడం తప్ప. అయితే స్వాతంత్ర పోరాటానికి మాత్రం ప్రధాన చిరునామాగా మహాత్మా గాంధీని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కొనియాడడం అంటే నిజంగా ప్రజా ఉద్యమానికి కొంత వక్ర భాష్యం చెప్పడమే నేమో అని అనుమానం రాక మానదు.
కరెన్సీ నోట్లపైన ప్రధానంగా మహాత్మా గాంధీ ఫోటోను ముద్రించడాన్ని జీర్ణించుకోలేనటువంటి కొన్ని ప్రజా సంఘాలు అదే ఆలోచన కలిగినటువంటి బుద్ధి జీవులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటో సాధన సమితి పేరుతో ఏర్పడినటువంటి ప్రజా సంఘం గత 5 సంవత్సరాలుగా జేరిపోతుల పరశురాము గారి నాయకత్వంలో పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్రలు, ప్రజా పోరుయాత్రలు, ఢిల్లీలో 19 సార్లు ధర్నాను నిర్వహించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రులను గవర్నర్ లను రాజ్యసభ సభ్యులను పార్లమెంటు సభ్యులను మరియు జాతీయ పార్టీల అధ్యక్షులను కలిసి వినతిపత్రం సమర్పించడం ఆ క్రమంలో జరిగినటువంటి వీరోచిత పోరాటంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముగింపుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచింపజేయడం కోసం 26 మార్చ్ 2025 బుధవారం రోజున ఢిల్లీలో బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న గారి ఆధ్వర్యంలో వందలాదిమంది కళాకారులచే ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమానికి డాక్టర్ జేరిపోతుల పరుశురాం గారు పర్యవేక్షణ జరపడం మనం గమనించవలసినటువంటి విషయం. ఇదే సందర్భములో కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటో ఆవశ్యకత ఏమిటి? ప్రస్తుతం ఉన్నటువంటి గాంధీ బొమ్మను ముద్రించడానికి గల కారణాలేమిటి?డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఆర్.బి.ఐ కి కరెన్సీ నోటు గల సంబంధం ఏమిటి? అనే విషయాన్ని క్రింది నుండి పై స్థాయి వరకు గుర్తించగలిగితేనే ఈ డిమాండ్ను మరింత బలోపేతంగా తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి కరెన్సీ నోటు ఎలా పుట్టింది బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో ఎలా ప్రారంభమైంది ఇతర అనేక దేశాల వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన కాలంలో ఏ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థ వుంది అనే విషయాన్ని అవలోకనం చేసుకోవడం అవసరం.
భారతదేశంలో ఆర్బిఐ అవతరణ నేపథ్యం
సాధారణంగా పూర్వకాలంలో ప్రజలు వస్తూ మార్పిడి ద్వారా తమ ఆర్థిక కార్యక్రమాలను నిర్వహించుకునే వాళ్ళు సామాజిక పరిణామ క్రమంలో కరెన్సీ నోటు వాడకలోకి రావడం ప్రారంభం కావడంతో ముఖ్యంగా భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభుత్వము బ్యాంకులను మొదటిసారిగా స్థాపించినది ఆ తర్వాత క్రమంలో 1806లో బ్రిటిష్ వారు బెంగాల్లో మొట్టమొదటి బ్యాంకును, 1840లో రెండవ బ్యాంకును ముంబైలో, 1843లో మూడవ బ్యాంకు ను మద్రాస్ లో స్థాపించగలిగినారు. అయితే ఈ బ్యాంకులు కేంద్ర బ్యాంకులుగా కాకుండా ప్రెసి డెన్షియల్ మరియు ప్రొవె న్షియల్ బ్యాంకులుగా మాత్రమే పని చేసినవి 1881లో అవది బ్యాంకును భారతీయుల యాజమాన్యంలో బ్రిటిష్ పెట్టుబడులతో స్థాపించినప్పటికీ ఈ బ్యాంకులు మాకు వద్దని మన భారతీయులు 1894లో చండీగఢ్లో మొట్టమొదటిసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంకును స్వతంత్రంగా స్థాపించుకోవడం జరిగింది. ఏది ఏమైనా స్వ దేశి ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధం, జలియన్వాలా బాగులో 1913లో జరిగినటువంటి మా రణకాండ, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అనేక కార్యక్రమాలకు గాంధీ నాయకత్వం వహించినప్పటికీ కొన్ని హింసా సంఘటనలు జరగడంతో గాంధీ ఉద్యమాన్ని మధ్యలో విరమించుకోవడంతో అనివార్యంగా సాయిధ పోరాటం రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ లాలాల జపతిరాయ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేకమంది వీరుల నాయకత్వంలో పోరాటం తారాస్థాయికి చేరుకున్నది. అప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం బాగా జరిగినట్లుగా తెలుస్తూ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రొవెన్షియల్ బ్యాంకులను 1921 లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. కానీ అది కేంద్ర బ్యాంకుగా తన విధులు నిర్వహించడంలో విఫలం కావడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 1923లో సగటు మనిషి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని" రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం(ది ప్రాబ్లెమ్ ఆఫ్ ద రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్) ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర" అనే పుస్తకాన్ని రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి రాయల్ కమిషన్కు సైమన్ కమిషన్కు 1926లో సమర్పించడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంలో అలజడి చలనము కలిగినట్లు తెలుస్తున్నది. ఈ కమిషన్లు బ్రిటిష్ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవశ్యకత గురించి చెప్పడంతో 1934లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించగా వెంటనే 19 35 ఏప్రిల్ ఒకటవ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమల్లోనికి రావడం చాలా గర్వంగా భావించవలసిన అవసరం ఉంది. దాని వెనుక అంబేద్కర్ గారి కృషిని గుర్తించడం ఎంతో అవసరం అదే సందర్భంలో 1949లో బ్యాంకులను జాతీయం చేయడంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకురావడానికి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేసినట్లుగా తెలుస్తుంది.
1950 జనవరి 26వ తేదీ నుండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటికీ తొలి ప్రభుత్వం అంబేద్కర్ని గుర్తించలేదు కానీ 1969లో గాంధీ జన్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐదు రూపాయల మీద పది రూపాయల నోట్ల మీద గాంధీ బొమ్మను ముద్రించడం ఆనాటి ప్రభుత్వం ప్రారంభించి ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నది తద్వారా కరెన్సీ అనగానే గాంధీ బొమ్మ తప్పనిసరి అనే విషయం పిల్లవాడి నుండి పెద్దల వరకు కూడా అర్థమయిపోయింది కానీ దాని వెనుక కృషి చేసినటువంటి అంబేద్కర్ను మాత్రం ఈ దేశం మరిచిపోవడం విచారకరం, వి డ్డూరం, శోచనీయం, అమానుషం, అనాగరికం కూడా.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను చిత్రించడం రక్షణ కర్తవ్యం
కరెన్సీ నోట్లపైన గాంధీ బొమ్మను చిత్రించడాన్ని వ్యతిరేకించడం కంటే కరెన్సీ నోట్లకు బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థకు రూపాయి దాని సమస్య పరిష్కారానికి ఇ తోదికంగా కృషి చేసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించడం చాలా అవసరం సందర్భోచితం కూడా. అవసరమైతే మహాత్మా గాంధీ బొమ్మను ఇతర అనేక సందర్భాలకు ఉపయోగించుకున్న ఎవరికి అభ్యంతరం ఉండకూడదు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా సంబంధంలేని వ్యక్తులను చిత్రించడం సంబంధము సమర్ధత ఉన్నటువంటి వాళ్లను అగౌరవపరిచి వివక్షతకు గురి చేస్తున్న సందర్భంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి పేరుతో కొనసాగుతున్నటువంటి గత ఐదు సంవత్సరాలు పోరాటం ఒక ప్రత్యేక రూపకల్పనగా 26 మార్చ్ 2025 రోజున చలో ఢిల్లీ పేరుతో ధూమ్ ధాం కార్యక్రమం కొనసాగించడానికి దేశ ప్రజలందరూ మద్దతు పలకాలి. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడం కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో జరుగునున్న ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం, చర్చించుకోవడం, ఆ కార్యక్రమం నేపథ్యాన్ని ప్రస్తావించడం ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. ఈ సాధన సమితి పోరాట నేపథ్యంలో 18 మంది ఎంపీలు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఆర్బిఐ గవర్నర్కు లేక రాయడం కూడా జరిగినట్లుగా ఉద్యమ పోరాట సంస్థ తెలియజేస్తున్నది. ఈ క్రమంలో బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఆర్థిక సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన సందర్భోచితమైనటువంటి ఒక డిమాండ్ గా దీనిని ఒత్తిడి తీసుకురావడానికి పోరాటం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం సందర్భోచితంగా ఉంటుంది. ప్రత్యేకంగా 2025 ఏప్రిల్అం టే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు జన్మించి 134 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవలసిన అవసరం ఉంది చరిత్రను ఈ ప్రభుత్వాలు విస్మరించడం బాధ్యతారాహిత్యం కూడా ఎందుకంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్.బి.ఐ లే నే లేదు అని అంటే అతిషయోక్తి కాదు. ఈ అంశాన్ని అత్యంత కీలకంగా భావించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్రమ చేసిన వాళ్లకు కనీస గుర్తింపునివ్వడం, పనిచేసిన వాడికి ఫలితం దక్కడం, పోరాటం చేసిన వాడికి చరిత్రలో పేరు నిలిచిపోవడం కనీస సంస్కారం. ఆ సంస్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబెడతాయని ఈ డిమాండ్ ను పరిశీలిస్తాయని మనసారా కోరుకుందాం.ఆశిద్దాం. ఆ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకు వద్దాం.
( కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ 2025 మార్చి 26న చలో ఢిల్లీ కార్యక్రమం డాక్టర్ ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో జరగనున్న ధూమ్ ధామ్ సందర్భంగా ఈ వ్యాసం )