మహిళా చదువుకో  రాజ్యాధికారం వేలుకో రచన:కడెం ధనంజయ

Jan 3, 2025 - 15:38
Jan 3, 2025 - 15:49
 0  93
మహిళా చదువుకో  రాజ్యాధికారం వేలుకో రచన:కడెం ధనంజయ

హిళా చదువుకో.. 
సమాజాన్ని మార్చుకో.. 
సమస్యలను తీర్చుకో..
సంఘటితంగా ఎదురుకో.. 


హిళలకు శక్తి ఉంది.. 
సాధించే గుణముంది.. 
పోరాడెతత్వముంది.. 
వెనుకబాటు తనం కనబడుతుంది.. 


చేయాలన్న కోరిక ఉంది.. 
పనిలో నేర్పరితనం వుంది.. 
పట్టుదల,మొండి గుణం ఉంది.. 
ప్రొచ్చాహం కరువైంది..


గ్రామీణ భారతంలో 
పేదరికం, అంటరానితనం 
సామాజిక కట్టుబాట్లు 
ఆర్ధికంగా వెనుకబడి 
మహిళలు చదువుకు దూరమై 


కుటుంబ అవసరాలకు 
ఇంటి,వంట పనికి 
కూలికి, వ్యవసాయంకే పరిమితమైన క్రమం


పూలే దంపతులు 
పాఠశాలలను స్థాపించి 
విద్యా వ్యాప్తికి కృషి చేసి 
మహిళలకు విద్యను అందించి


వివక్షతను లెక్కచేయక 
మహిళల అభివృద్ధికి 
మానసికంగా సిద్దపరిచిన 
సావిత్రి జ్యోతిరావు పూలే


దేశంలో ప్రభుత్వ బడులున్న.. 
ఉపాధ్యాయులు లేని పరిస్థితి.. 
పిల్లలు చేరలేని స్థితి.. 
కనీస అవసరాలులేని దుస్థితి..


ప్పటికైనాబడులను విస్తరించాలి.. 
సౌకర్యాలను అందించాలి.. 
నిరక్ష్యరాశ్యతను నిర్ములించాలి.. 
ప్రతి ఆడబిడ్డకు చదువు నేర్పాలి.. 


హిళలు స్వశక్తితొ బ్రతుకుతారు..ఆర్థికంగా నీలదొక్కుకుంటారు.. 
కుటుంబానికి ఆసరాగా.. ఉంటారు.. ఆత్మ గౌరవంతొ జీవిస్తారు..

ప్పుడే ప్రభుత్వాలు.. 
ప్రగతి సాధించినట్లు.. 
భాద్యతలు నెరవేర్చినట్లు.. 
వివక్షతను పోగొట్టినట్లు..


(మహిళా దినోత్సవ సందర్బంగా)
రచన: కడెం ధనంజయ 
చిత్తలూరు.