కన్నుల పండుగగా గోదా రంగనాయకుల కళ్యాణం

Jan 14, 2026 - 20:40
Jan 14, 2026 - 20:41
 0  25
కన్నుల పండుగగా గోదా రంగనాయకుల కళ్యాణం

కన్నుల పండుగగా గోదా రంగనాయకుల కళ్యాణం 

భక్తి జన సందోహం నడుమ సాగిన ధనుర్మాస ముగింపు ఉత్సవాలు 

సూర్యాపేట (జనవరి 14) : జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ శ్రీ విజయాంజనేయ స్వామి దేవస్థానం నందు బుధవారం శ్రీ గోదారంగ నాయక స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.అర్చకులు మరింగంటి వరదాచార్యులు మాట్లాడుతూ నెల రోజులు ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం అన్నారు.కళ్యాణ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణ క్రతువు నిర్వహించి భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు,ఆలయ ట్రస్టీ ఛైర్మెన్ కొప్పుల కరుణాకర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతుగంటి రామారావు, గౌరవ సలహాదారులు కీసర అంజన్ రెడ్డి నాగవెల్లి ప్రభాకర్, సభ్యులు సామ వెంకటరెడ్డి, ఆవుల వెంకన్న, కొలిశెట్టి శ్రీకాంత్, భక్తులు రామ్ దేని ఆదినారాయణ ,వెన్న శ్రీనివాస్ రెడ్డి, కట్టెకోల పూర్ణచంద్రరావు మరియు సీతాగోష్ఠి శ్రీదేవి,మాధవి, సారిక , శ్రీరమ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333