ప్రిన్సిపల్ అంజయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థిలు శివ,అఖిల్

అడ్డగూడూరు 21 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ గురుకుల పాఠశాల అయిన గచ్చిబౌలి (గౌలిదొడ్డి) బాలుల గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ప్రిన్సిపల్ అవార్డును అందుకున్న తీగల అంజయ్య మర్యాదపూర్వకంగా చెరుకు శివరాజ్,మొలుగూరి అఖిల్ కలిసి వారిని సాల్వతో సన్మానం చేయడం జరిగింది. వారికి సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని అందజేశారు.అంజయ్య గట్టుసింగారంలో చదువుతున్న విద్యార్థుల గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ప్రగతి కోసం న సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు నాలాగా పై చదువులు చదివి ఉన్నంతమైన స్థానాలకు ఎదగాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో శివ, అఖిల్ ఉన్నారు.