ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల  మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమైన

బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

Aug 31, 2026 - 11:21
Aug 31, 2026 - 11:47
 0  63
ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల  మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమైన
ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల  మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమైన

వారి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ పార్టీ

మంగపేట,01 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మాలోతు స్వాతి యాకూబ్ దంపతులు రాఖీ పండుగ సందర్భంగా ములుగు మండలం గణేష్ లాల్ గ్రామంలోని తమ పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో వారి కుమారులు మాలోత్ వినయ్ రాజేష్‌లు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారు.అన్నదమ్ములిద్దరూ మరణించిన విషాదకర ఘటన తెలుసుకున్న ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.చిన్నారుల మృతదేహాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన లక్ష్మణ్ బాబు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని చిన్నారుల మృతదేహాలకు నివాళులర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333