మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో వృథాగా పోతున్న తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యంపై కాలనీ వాసులు ఆగ్రహం
లీకేజ్ అవుతున్న చిత్రం.
రోడ్డుపై వేల లీటర్ల నీరు వృధా.
మరి ముఖ్యంగా ప్రమాదకర గుంత కూడా ఉండడం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది.
జోగులాంబ గద్వాల 18 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణం జిల్లా కేంద్రంలోని 16 వార్డు ఉన్న నవరంగ్ టాక్స్ కి వెళ్లే ప్రధాన రహదారిలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది.కొన్ని రోజుల నుండి పైప్‌లైన్‌లో లీకేజీ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక 16 వార్డు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ పథకంలో ఇలాంటి లీకేజీల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరగడమే కాకుండా నీరు వృథా అవుతుందని ఆవేదదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్ పర్సన్ మరియు వాడు కౌన్సిలర్,అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేసి, నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మిషన్ భగీరథ పైప్‌లైన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మరి ముఖ్యంగా ప్రమాదకర గుంత కూడా ఉండడం వాహనదారులకు రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది.