ఇంకా‌ కొనసాగుతున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన

Aug 20, 2026 - 19:12
 0  2

కలెక్టర్ వచ్చేంత వరకు అందోళన విరమించబోం.

నాలుగు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.

జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల‌ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ ముందు ఉన్న రోడ్డుపై బైఠాయించి‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు ఉదృతం చేశారు. గురువారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకు చేపడుతున్న విద్యార్థుల ఆందోళన కార్యక్రమం రోడ్డు వెంట‌ వెళ్లే‌ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.. గద్వాల జిల్లా పోలీసులు ప్రత్యేక బందోబస్తు‌ నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333