ఉద్యమం లో మహిళలము భాగస్వామ్యం అవుతాము.  

దీక్ష లో అంగన్వాడి మహిళలు 

Aug 30, 2026 - 20:02
Aug 30, 2026 - 20:02
 0  1
ఉద్యమం లో మహిళలము భాగస్వామ్యం అవుతాము.  

సూర్యాపేట.... బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 17వ రోజు అంగన్వాడి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్యలో ఉన్న సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైలు మార్గాన్ని సాధించుకోలేకపోతునామన్నారు.కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా ఇచ్చినట్టే ఇచ్చి పక్కదోవ పట్టిస్తున్న పాలకుల పై జమలు చేసి బుల్లెట్ అని తగ్గించుకుంటామని ప్రత్యేక చేశారు.ఈ దీక్షలో భాస్కరమ్మ, వసంత,ఏకలక్ష్మి సంతోషకుమారి, వెలుగు వనిత పాల్గొన్నారు. ఈ దీక్ష కు బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి, రమణాచారి, ధర్మార్జున్, డేవిడ్ కుమార్, సి ఐ టి యు నాయకులు కోటగిరి వెంకట నారాయణ,నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, జీడి బిక్షం, నవిలే ఉపేందర్,విద్యా సాగర్ రావు, నారబోయిన వెంకట్ యాదవ్, యాదయ్య,సట్టు నాగయ్య లు సంఘీభావం తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333