మద్దిరాల గ్రామానికి చెందిన దండే శివ ప్రసాద్‌కు జాతీయ స్థాయి విద్యా ప్రతిభకు ఘన సన్మానం

Aug 13, 2026 - 00:14
 0  1
మద్దిరాల గ్రామానికి చెందిన దండే శివ ప్రసాద్‌కు జాతీయ స్థాయి విద్యా ప్రతిభకు ఘన సన్మానం

మద్దిరాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి  చెందిన దండే రామనర్సయ్య సునీత దంపతుల కుమారుడు దండే శివ ప్రసాద్   సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్స్ ప్రతిభ కనబరిచి జూనియర్ రీఛార్జ్ ఫాలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించడంతో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ ఏ ఐ ఆర్ 100 సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి అర్హత మరియు పీహెచ్ డి ప్రవేశానికి అర్హత సాధించడం విశేషం.ఈ ఘనతకు గుర్తింపుగా 09 ఆగస్టు 2026న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన బెట్ విజన్ మీట్ 2026 కార్యక్రమంలో  ఎంపీ డా"కడియం కావ్య చేతుల మీదుగా దండే శివ ప్రసాద్‌ను సర్టిఫికెట్ ఆఫ్ ఎగడ మిక్ ఎక్స్లెన్స్ తో  ఘనంగా సన్మానించారు.జేఆర్ఎఫ్ ద్వారా లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని దండే శివ ప్రసాద్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లోని జూలజీ విభాగంలో పి హెచ్ డిలో ప్రవేశం పొంది పరిశోధన కొనసాగిస్తున్నారు. జంతుశాస్త్రం,ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆయన తన అకాడమిక్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.తమ కుమారుడు సాధించిన జాతీయ స్థాయి విజయంపై తల్లిదండ్రులు దండే రామనర్సయ్య,దండే సునీత ఆనందం వ్యక్తం చేశారు.శివ ప్రసాద్‌ను మద్దిరాల గ్రామస్థులు,బంధుమిత్రులు, గురువులు,శ్రేయోభిలాషులు మరియు బేటా సభ్యులు అభినందిస్తూ,భవిష్యత్తులో పరిశోధనా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333