పూరిగుడిసె లేని రాష్ట్రంగా తీర్చి దిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
తిరుమలగిరి 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు చిలుకల ఐలమల్లు-రేణుక నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై వారి కుటుంబ సభ్యులకు నూతన పట్టు వస్త్రాలను పెట్టి వారికి శుభాకాంక్షలు తెలిపిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూరిగుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సహకారంతో అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ వెంకటమ్మ లింగయ్య తిరుమలగిరి మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ బత్తుల శ్రీను వెలిశాల గ్రామ ఒకటో వార్డు మెంబర్ ఆకుల వీరసోములు కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరు నాయక్.. కొండయ్య..వెలిశాల మాజీ వార్డ్ మెంబర్ వెంకన్న(రవ్వ లడ్డు).. సట్టు శంకర్..ఎల్లంల అశోక్ యాదవ్.. గౌచర్ల శ్రీకాంత్.. చిలుకల నరసింహ.. ఆకుల యాకన్న.. వెంకన్న (చంద్రబాబు) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెలిశాల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...