ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

Nov 18, 2024 - 16:37
 0  11
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

జోగులాంబ గద్వాల 18నవంబర్ తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారని అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని సోమవారం తెలిపారు.వివరాల్లోకి వెళితే..గద్వాల పట్టణం వద్దేవీదికి చెందిన జయశ్రీ,నరేష్ లకు 2020లో వివాహం కాగా..2022 మొదటి కాన్పులో ఒక పాప జన్మించిందన్నారు.ఇప్పుడు రెండవ కాన్పులో ఒకేసారి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని తెలిపారు.ఇప్పుడు జన్మించిన వారిలో ఒక పాప,ఇద్దరు మగశిశివులు ఉన్నారని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటంతో.. అనంత హాస్పిటల్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని మాట్లాడుతూ.. హాస్పిటల్ లో మొదటి సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశివులు జన్మించడం..తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పుకు సంబంధించి శస్త్ర చికిత్సలో సహకరించిన డాక్టర్ వినిషారెడ్డి,డాక్టర్ బిందు సాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333