విద్యార్థులకు సాక్షి పత్రిక ఆధ్వర్యంలో మెటీరియల్ అందజేత  

Jan 23, 2026 - 19:53
 0  29
విద్యార్థులకు సాక్షి పత్రిక ఆధ్వర్యంలో మెటీరియల్ అందజేత  

   అడ్డగూడూరు 23 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పదవ తరగతి విద్యార్థులకు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో  ఉచితంగా అందజేస్తున్న స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్  శేషగిరిరావు,ఎంఈఓ సబిత అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని అడ్డగూడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 23 మంది విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్ ను  తహసిల్దార్ శేషగిరిరావు, ఎంఈఓ సబిత అందజేశారు.అలాగే కంచనపల్లిలో నీ  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 50 విద్యార్థులకు సర్పంచ్  చెడే అంబేద్కర్ సాక్షి  మెటీరియల్ ను అందజేశారు.కోటమర్తి జడ్పీహెచ్ఎస్ లో 12 మంది విద్యార్థులకు సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ రావు,ప్రధానోపాధ్యాయులు రాజా వర్ధన్ రెడ్డి మెటీరియల్ ను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు సాక్షి మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని  పరీక్షల్లో 100% ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు ప్రధానోపాధ్యాయులు వెంకటాద్రి,కస్తూర్బా పాఠశాల ఇంచార్జ్ ఎస్.ఓ  సరిత,సూపర్డెంట్ దేవేందర్,సాక్షి రిపోర్టర్ దాసరి బాలకృష్ణ,డిప్యూటీ తాహసిల్దార్ నరసింహారావు, ఉపాధ్యాయులు కూరాకుల రవీందర్,లక్ష్మణ్,నరేష్, నరసింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333