ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Apr 13, 2025 - 22:35
Apr 13, 2025 - 23:27
 0  48
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 - పండుగ వాతావరణంలో స్కూల్ ప్రదేశం 

- స్కూల్ స్నేహితులను కలుసుకోవడం మా అదృష్టం 

నాగారం ఏప్రిల్ 13. తెలంగాణ వార్త:-  నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో పదవ తరగతి బ్యాచ్ 1985-1986 పూర్వ విద్యార్థుల 2 వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. తమ గురువులు శర్మ, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లయ్య, సుదర్శన్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మా జీవితములో స్నేహం మరపురాని తీపి జ్ఞాపకమని, చదువుకున్న స్నేహితులను కలుసుకోవడం అదృష్టం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవిలయ్య, సుధాకర్, వీర మల్లయ్య, కడారి పద్మయ్య, రజిత, శోభ, పద్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333