వెల్దేవి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ తాళం తీయని పోస్ట్ మ్యాన్ ఇబ్బందులు పడుతున్న పెన్షన్ దారులు,గ్రామస్తులు

Feb 6, 2026 - 16:14
 0  3
వెల్దేవి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ తాళం తీయని పోస్ట్ మ్యాన్ ఇబ్బందులు పడుతున్న పెన్షన్ దారులు,గ్రామస్తులు
వెల్దేవి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ తాళం తీయని పోస్ట్ మ్యాన్ ఇబ్బందులు పడుతున్న పెన్షన్ దారులు,గ్రామస్తులు

   అడ్డగూడూరు 6 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో పోస్ట్ కార్యాలయం తాళం గత వారం రోజుల నుండి తీయని పోస్ట్ మ్యాన్ వివరాల్లోకి వెళితే సంక్రాంతి తర్వాత ట్రాన్స్ఫర్ పై చరణ్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లగా వారి స్థానంలో ఇన్చార్జిగా తరుణ్ కు అప్పగించారు.కానీ రోజుకు ఒక గంట అయినా వచ్చి పోవాల్సిన బాధ్యత వారిపై ఉంది.కానీ వారం రోజులైనా కార్యాలయం తాళం తీయని పరిస్థితి నెలకొంది.గ్రామంలోని పెన్షన్ దారులు వికలాంగులు,వృద్ధులు, వితంతువులు ఒంటరి మహిళలు,పెన్షన్ కొరకు పడిగాపు కాస్తున్న..వచ్చిన డాకడాలు లేవని గ్రామస్తులు అంటున్నారు.పోస్ట్ ఆఫీస్ లో ఆర్.పి.ఎల్,కట్టేవారు పోస్ట్ ఆఫీస్ ఖాతాలో డబ్బులు వేసేవారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మహిళలకు నెల నేల పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పిల్లలకు జమ చేసే సమయం..  తల్లిదండ్రులు వచ్చిపోయే సమయంలో కార్యాలయంలో ఎవరూ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా వెల్దేవి గ్రామానికి పర్మినెంట్ గా ఒక పోస్ట్ అధికారిని నియమించాలని గ్రామస్తులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333