ఇందిరమ్మ ఇళ్లపై గుడ్‌న్యూస్.. ఇకపై సిటీల్లో G+3 ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరాలు, పట్టణాల్లోనూ విస్తరించనుంది. ఇప్పటివరకు గ్రామాల్లో మాత్రమే ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం, త్వరలోనే సిటీలలో G+3 అపార్ట్‌మెంట్ల రూపంలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. పేదవాడల్లో నివసించే వారికి ఆధార్, ఫోన్ నంబర్లతో లిస్ట్ తయారు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సహాయంతో ఇళ్లు కట్టి ఇవ్వనుంది. కాగా, జూలై నుంచే ఈ నిర్మాణాలు మొదలయ్యే అవకాశం ఉంది.