ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ కళాశాల విజయభేరి
తెలంగాణవార్త 24 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ నిజామాబాద్ విజయభేరి మ్రోగించింది. బుధవారం ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఏప్రిల్ 2024 రెండవ సంవత్సరం ఫలితాలలో నిజామాబాద్ నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థి జూనియర్ ఇంటర్ లో 470 మార్కులకు గాను 467 మార్కులతో నారా మాధవి నాగశ్రావ్య హాల్ టికెట్ నెంబర్ 2545103732 రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంక్ పొంది నిజామాబాద్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి నిజామాబాద్ ఖ్యాతిని తెలంగాణకి నారాయణ జూనియర్ కాలేజీకి గర్వకారణం అని నారాయణ విద్యాసంస్థ నిజామాబాద్ ప్రిన్సిపాల్ కుంట లక్ష్మారెడ్డి, ఏవో మేదరి శేఖర్, కోర్ డీన్ యు.వి ప్రసాద్,జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు అభినందించారు.
ఇటీవల విడుదలైన 2024 జేఈ మెయిన్,సెషన్ వన్ ఫలితాలలో కూడా నారాయణ 99.62 శాతం మర్రి హర్ష జిల్లాలో మొదటి స్థానంతో నారాయణ విజయప్రస్థానం ప్రారంభమైందని చెప్పడానికి గర్విస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ లో ఇంటర్ విద్యలో స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రస్థాయిలో మూడవ అత్యధిక ర్యాంక్ 467 అలాగే 466 లవంగా వైష్ణవి, పంచమహల్కర్ రియా ఇద్దరూ 465 కాటేపల్లి సాత్విక్,తాడూరి శ్రీరామ ప్రియ,రాచార్ల బాస్విని 464, బండి శ్రగ్వి ముగ్గురు,462 అంబటి శర్వాణి,నల్లూరి శ్లోకా చౌదరి ఇద్దరూ, 461 ఆకుల సుహాస్,456 గంజి నిహారిక, 455 మెగావత్ అజయ్, 451 గంగోని శ్రీదీప్తి సాధించడం మన నిజామాబాదులో కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు అయిందని అన్నారు.
ఇలా జూనియర్ ఎంపీసీలో 470 కి 460 పైన మార్కులు 10 మంది సాధించారని,466 పైన మార్కులు 3 మంది,470 కి 450 పైన మార్కులు 13 మంది సాధించారని, రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలులో శివ రాశి కీర్తన 1000 మార్కులకు గాను 991,మర్రి హర్ష,987,మలిపాటి ఈశా 986,మాలే లిఖిత్ 985,లక్ష్మీ ప్రసన్న 984, శ్రీజ 982,మెహర్ నిధి 978, సిరి గారి హర్షిని 972,కట్టా శ్రీనివాసరెడ్డి 972,పెంట కారుణ్య 970 ఉత్తమ మార్కులు సాధించడం కాలేజీకి గర్వకారణంగా ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి తెలియజేశారు. జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 424 బెస్ట్ మార్కుతో గోసాల దివ్యశ్రీ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తున్నామన్నారు.
ఇంజనీర్ కావడమే లక్ష్యం.. నారా మాధవి నాగశ్రావ్య..
నారాయణ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో పాటు నిత్యం పర్యవేక్షణలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే అత్యధిక మార్కులు సాధించడం జరిగింది.మొదట హైదరాబాదులో కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ నిజామాబాద్ లోనే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారని తెలుసుకొని ఇక్కడ జాయిన్ కావడం జరిగింది.తరగతి గదిలో ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసే అధ్యాపకులు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మంచి మార్కులు సాధించి ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం.