అడ్డగూడూరుకు పునాదిగాని కాల్వ మోక్షం ఎప్పుడో..?

Jul 6, 2024 - 18:01
Jul 6, 2024 - 18:05
 0  18
అడ్డగూడూరుకు పునాదిగాని కాల్వ మోక్షం ఎప్పుడో..?
అడ్డగూడూరుకు పునాదిగాని కాల్వ మోక్షం ఎప్పుడో..?

అడ్డగుడూరు ప్రాంత ప్రజలకు 24 గంటల

వైద్య సేవలు అందించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి యం. డి జహంగీర్

అడ్డగూడూరు 06 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- శనివారం రోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్  ఆధ్వర్యంలో సీపీఎం పొరుయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ యాత్ర కి ముఖ్య అతిధిగా సీపీఎం జిల్లా కార్యదర్శి యం. డి జహంగీర్ హాజరై మాట్లాడుతూ.. అడ్డగుడూరు మండలనికి బునాధిగాని కాల్వ రెండు దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైపోతుంది తప్ప పట్టించుకునే నాధుడే లేదని ఆవేదన వ్యక్తంచేశారు ఎక్కడ  ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ప్రజల అవసరాలను పట్టించుకునే పరిస్ధితిలో లేరని అన్నారు.సాగు నీరు, త్రాగు నీరు,కోసం ఇంకా ఎన్ని దశాబ్దాలుగా వేచి చూడాలని అన్నారు.తక్షణమే బునాధిగాని కాల్వకి ఒక గడువు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకోచి పనులు ప్రారంభించాలని అన్నారు.అదే విధంగా అడ్డగుడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాని సందర్శించి మండల వ్యాప్తంగా ఇప్పుడు ఉదయం 9:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు మాత్రమే వైద్య సేవలు కోనసాగుతున్నాయి దీని వలన ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాపోయారు తక్షణమే 24 గంటల వైద్య సేవలు అందించి ప్రజలకు న్యాయం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని అన్నారు. అదే విధంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ.. మండలంలో అన్ని గ్రామాలకు లింక్ రోడ్డు సౌకర్యం ఉంది కాని అది పూర్తి స్థాయిలో లేనందున ప్రజలు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తక్షణమే లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు.అనంతరం జిల్లా కార్యదర్శి సమక్షంలో గోవిధాపురం గ్రామం నుంచి పసల థామస్ సీపీఎం పార్టీ కి అకర్షితుడై పార్టీలో చేరడం జరిగింది థామస్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తే నాయకులు ఉన్నారు తప్ప ప్రజలను ప్రజల బాగోగులను చూసే నాయకులు లేరని ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలో చేరినందుకు అందరికి ధన్యవాదాలు తెలువుతున్నాను పార్టీ బలోపితనికి కృస్థి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు,రైతు సంఘం నాయకులు పైల యాద్దిరెడ్డి,మండల కమిటీ సభ్యులు చిత్తలూరి మల్లయ్య,శీలం శ్రీనివాస్,రాయిలా రాజ్ కుమార్, గోవిందు బాలసౌరి,చింటూ,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.