ఎస్ఎన్ఎస్ (SNS)కంపెనీ కాలుష్యంపై  ఎర్రవల్లి మండలం తహసీల్దార్ కి పిర్యాదు

Dec 7, 2024 - 13:57
 0  9
ఎస్ఎన్ఎస్ (SNS)కంపెనీ కాలుష్యంపై  ఎర్రవల్లి మండలం తహసీల్దార్ కి పిర్యాదు

జోగులాంబ గద్వాల 7 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎస్ఎన్ఎస్ కంపెనీపై చర్యలు శేకుపల్లి మరియు కొండేరు,జింకలపల్లి, శేకుపల్లి, దువాసిపల్లి, వీరాపురం, పూటన్ దొడ్డి, మునగాల,గ్రామాల నుంచి దాదాపు 200మంది ప్రజలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు   కలిసి ఎర్రవల్లి మండలం తహసీల్దార్ నరేష్ కి లిఖితపూర్వకంగా పిర్యాదుచేయడం జరిగింది .
తాగేనీటిని,పంటపొలాలను,పీల్చేగాలిని విషపూరితం చేస్తూ జనం శవాలపై సొమ్ములు ఏరుకుంటున్న కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదులో పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని,నదీజలాల కాలుష్య నియంత్రణ చట్టాన్ని యధేచ్ఛగా కాలరాస్తున్న ఎస్ఎన్ఎస్ కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని వారు కోరారు.
వారం క్రితం కలెక్టర్ కి ఆదేశాల మేరకు ఎర్రవల్లి మండలం తహసీల్దార్  SNS కంపెనీ దగ్గరికి పోతే కంపెనీ వాళ్ళు10నిమిషాలు అక్కడే ఉన్న గేట్ కూడా ఓపెన్ చేయలేదు అని తహసీల్దార్  చెప్పడం జరిగింది....వారితో పాటు..శేకుపల్లి మాజీ సర్పంచ్ G.రవీందర్ రెడ్డి ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి... బిమేశ్వర్ రెడ్డి  కొండేరు మాజీ సర్పంచ్ వీరన్న .ఎంపీటీసీ భర్త వీరన్న .. సుధాకర్ రెడ్డి .బండి గోవింద్ ..కాంత రెడ్డి.. సంజీవ నాయుడు... రవి.. ఉప్పరివెంకటన్న... మదిలేటి....కాషాపోగు బీచుపల్లి.. కుమార్... ఆయా గ్రామాల ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333