బండ్ల రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి

గతంలో లైంగిక వేధింపుల కారణంగా మాజీ ఎంపీటీసీని కాంగ్రెస్ పార్టీ

Nov 1, 2024 - 20:49
 0  15
బండ్ల రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి

 సస్పెండ్ చేసినట్లు బండ్ల రాజశేఖర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు

నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు లవన్న, రంగస్వామి

జోగులాంబ గద్వాల1 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల బిజ్జారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి చావుకు కారణమైన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో  జిల్లా నాయకులు లవన్న, రంగస్వామి ప్రశ్నించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరితా తిరుపతయ్య  విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నీ లైంగిక వేధింపుల కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బండ్ల రాజశేఖర్ రెడ్డిని ఎందుకు చేయడం లేదని అన్నారు.ప్రస్తుత ఎమ్మెల్యే,పార్టీ ఇంచార్జ్ లు పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని గతంలో ఒక బహుజన బిడ్డ పై తీసుకున్న చర్యలకు ఉన్న ధైర్యం ప్రస్తుతం ఏమైందని,మీ పార్టీకి పండింగ్ చేస్తాడనా?లేక మరే  కారణమైన వున్నదా? అని ప్రశ్నించారు.
బండ్ల రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదై పోలీసులను తప్పించుకొని తిరుగుతూన్న A1గా ఉన్నటువంటి వ్యక్తిపై ఇంతవరకు పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333