మదక ద్రవ్యతిరేక వారోత్సవాలు: ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ట్రాఫిక్ ఎస్సై
హెల్మెంట్ లేకపోతే జరిమానా... వాహనాలు సిజ్
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల పట్టణం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం గద్వాల పట్టణ కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు ఆధ్వర్యంలో మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా వాహన తనికి నిర్వహించి వాహనదారుల చేత ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకంతో జీవితం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. డ్రగ్స్ దూరంగా ఉంచాలన్న సంకల్పంతో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పొగకు, కైని,గుట్కా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.మాదక ద్రవ్యాలు తీసుకో వడం వల్ల భవిష్యత్ సర్వనాశనమవుతుం దన్నారు.మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని అని అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది రమేష్,సుధాకర్ శివకుమార్,యూగేందర్,విష్ణు, తదితరులు ఉన్నారు.