ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి ఎస్ఐ సత్యనారాయణ గౌడ్
తిరుమలగిరి 11 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛ గా ప్రశాంతంగా నిర్వహించేందుకు మే 11 శనివారం సాయంత్రం 6 గంటలకు నుండి 14 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు శుక్రవారం కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. వారి ఆదేశాల మేరకు తిరుమలగిరి మండల ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున శనివారం సాయంత్రం 6:00 నుండి తిరుమలగిరి మండలంలోని గ్రామాల్లో మరియు పట్టణ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమావేశాలు గాని, సభలు గాని, ర్యాలీలు నిర్వహించడం గాని నిషిద్ధమన్నారు. జనం గుంపులు గుంపులుగా, అయిదుగురు కంటే ఎక్కువ సమూహంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇంటింటి ప్రచార నిర్వహించడం కానీ, పదునైన ఆయుధాలు, కర్రలు, కత్తులు, రాళ్ల వంటివి వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించామని ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు.