ప్రశ్నించే గొంతుకను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
తిరుమలగిరి 11 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- మే13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీసీ కులానికి చెందిన క్యామ మల్లేష్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కుమార్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ నుండి తిరుమలగిరి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ బైకు ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు రైతులకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేశారని ఆయన చెప్పారు. రైతు బాధలు చూడలేక రైతుబంధు, రైతు బీమా, నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఆసరా పింఛన్లు, మైనార్టీ బందు, బీసీ బందు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ గా గుర్తింపు తీసుకొచ్చాడని ఆయన అన్నారు. నేడు నోటు ఓటు కేసులో జైలుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ ల పేరుతో బూటక వాగ్దానం ఇచ్చి నేటి వరకు కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటని విషయమని చెప్పారు. అధికారంలో రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నేటి వరకు రుణమాఫీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. రైతుబంధు నేటికి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదని ఆయన విమర్శించారు. ఇటీవల కెసిఆర్ బస్సు యాత్ర పేరుతో గ్రామాల్లో పర్యటించగానే శ్రీరామ్ సాగర్ కాల్వలో నీరు వదిలి పెట్టారని అని చెప్పారు. శ్రీరామ్ సాగర్ జలాలు ఎక్కడ నుండి వస్తాయో అర్థం కాని పరిస్థితిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆయన చెప్పారు. గ్రామాల్లో రైతులు వేసిన పంటల ఎండిపోయి గిట్టుబాటు ధరల రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు, రైతు పండించిన పంటకు బోనస్ అందిస్తామని చెప్పి కూడా నేటి వరకు ఇవ్వలేదని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోత విపరీతంగా ఉండటం మూలంగా రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయని అని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేష్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు .తాను తుంగతుర్తి శాసన సభ్యునిగా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. సాగు, తాగునీటితోపాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు అందేలాకు చేసానని చెప్పారు. ఎలాంటి రాజకీయ కక్షలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ గెలిపించాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ శాసనసభ్యులు తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ బూడిద బిక్షమయ్య గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జాదీపిక యుగంధర్ రావు, బిఆర్ఎస్ పార్టీ తిరుమల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, దూపటి రవీందర్, మోడెపు సురేందర్, కందుకూరి ప్రవీణ్, బాబు, ఆనంగందుల మల్లేష్, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.