సామాన్యుల ప్రాణాలు తృణప్రాయమా.?
సామాన్యుల ప్రాణాలు తృణప్రాయమా.? ఉన్నోళ్లకు చిన్న దెబ్బ తాకితేనే ఉలిక్కిపడుడేందుకు ?
సినిమా నటులు, హీరోలంటే అంత పిచ్చి జనానికి పనికిరాదు.
చేతులు కాలినాక ఆకులు పడితే ప్రయోజనం ఏమిటి?
పుష్ప2 తొక్కిసలాటతో గుణపాఠం రావాలి మరి!!!
వడ్డేపల్లి మల్లేశం
15..12...2024
వ్యక్తిగత సామాజిక ప్రయోజనాలను అందరము కాంక్షిస్తాము అందులో తప్పులేదు కానీ సమాజానికి ఏ రకంగా కూడా ఉపయోగపడని ఆడంబర కార్యక్రమాలను ప్రభుత్వాలు సమర్థించడం, ప్రోత్సహించడం, కానుకలు ఇవ్వడంతోపాటు ప్రజలు కూడా గుడ్డి విశ్వాసంతో వెంటపడి తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్న సందర్భాలను గమనించినప్పుడు కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉంటుంది. క్రికెట్ ఇతర ఆటలు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో తా మ్ర ము రజతం వంటి పథకాలు వచ్చిన వారికి కూడా ఘన స్వాగతాలు పలికి సెంచరీలు చేసిన వారిని ఊరేగించి అతి చేస్తున్నాము. సకల సమస్యలను పరిష్కరించడానికి, పేదరికం నిర్మూలించడానికి, అనారోగ్యము నుండి ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి చేసిన గొప్ప పని లాగా వారికి ఇళ్ల స్థలాలు కోట్లాది రూపాయలు ఇవ్వడంతో పాటు అక్రమ సంపాదనను కూడా ప్రోత్సహించిన సందర్భాలు అనేకం. ఇది ఏ రకంగా కూడా వాంచ నియం కాదు. ఇప్పటికీ 20 శాతం పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగుపడి వలస కార్మికులుగా ఉపాధి లేకుండా వీధి బతుకులు బతుకుతున్న కోట్లాది శ్రమజీవుల గురించి పట్టించుకోని పాలకవర్గాలు క్రీడలతోపాటు సినిమా రంగాలలో ఉన్న వారిని మాత్రం ఆకాశానికి ఎత్తడం అంటే ఈ దేశంలో సమన్యాయ పాలన రాజ్యాంగంలో రాసుకున్న ఆచరణలో లేదు అని చెప్పక తప్పదు. చట్టం ముందు అందరూ సమానులే పదవులు అర్హతలు ఉద్యోగాలు చదువులు సంపదలతో సంబంధం లేదు అనేది సమన్యాయ పాలన కానీ సంపన్నులకు ఒక న్యాయం సామాన్యులకు మరొక న్యాయం ఒకవైపు కొనసాగుతూ ఉంటే సంపన్నులకు అనుకూలంగా తీర్పులు వచ్చిన సందర్భాలు సామాన్యులు సంవత్సరాల తరబడిగా విచారణ ఖైదీలుగా జైలలో మగ్గుతున్నటువంటి ఆనవాళ్లను మనం చూసినప్పుడు ఈ ఆరోపణ నిజం కాదు అని ఎవరైనా చెప్పగలరా? పేదలు ప్రమాదాలలో పాలకవర్గాల చేతిలో పెట్టుబడుదారి వర్గం ఇతర క్రీడలు సినిమా రంగాల సమావేశాలు ఊరేగింపులు సినిమా ప్రదర్శనల తొక్కిశలాటలో ఎందరు చనిపోయిన ప్రభుత్వాలకు మిగతా వర్గాలకు ఏమీ పట్టదు.కానీ ఆ నేరాలకు బాధ్యులైన సంపన్నులు జైలుకెళ్లిన, అవమానించబడిన,ప్రశ్నించబడిన చట్టంతోపాటు అందరూ కూడా సలాం చేసేటటువంటి దుస్థితి ఇప్పటికీ కొనసాగడాన్ని ఎక్కడికక్కడ ఖండించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
పుష్ప టు ప్రదర్శన తొక్కిసలాట రేవతి మృతి తదనంతర పరిణామాలు:-
సినిమా నిర్మాణంలో, కథనంలో సమాజ ఉపయోగకరమైనటువంటి అంశాలు ఏవి లేకపోయినా ప్రభుత్వానికి అంతగా పట్టు లేకపోవడం చూసి చూడనట్లు ఊరుకోవడం ఖర్చులు ఎక్కువైనయంటే ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతించడం వంటి అంశాల వల్ల ప్రభుత్వము దారి తప్పుతున్నది అని చెప్పవచ్చు. హీరోలు నటులు తీసుకునే పారితోషం కం గణనీయంగా పెంచి భారీ బడ్జెట్ సినిమా అని నమ్మబలికి ధరలు పెంచుకోవడానికి అనుమతి కోరి ఆ రకంగా ఆ భారీ సొమ్మును ప్రజల నుండి పీల్చి పిప్పి చేస్తూ రాబట్టే ప్రయత్నంలో బెనిఫిట్ షోలను నిర్వహించి జనాన్ని పిచ్చివాళ్లను చేసి ఎంతోమంది మృత్యువాత పడుతున్న సందర్భాలు సినిమా రంగంలోనూ క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్ రంగంలో మనం చూడవచ్చు. 4 డిసెంబర్ 2024 వ తేదీన హైదరాబాదులోని సంధ్య థియేటర్ దగ్గర పుష్పటు సినిమా ప్రదర్శన సందర్భంగా వేలాదిమంది తొ క్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం సినిమా హీరో అల్లు అర్జున్ రావడంతో చెలరేగినటువంటి జన సమర్థం కారణంగా ఇది జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉంటే సమాచారం లేదని పోలీసులు బందోబస్తుకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని నిర్వాహకలు చెబుతున్న సందర్భంలో ఏ నేరము చేయనటువంటి ఏమి ఆశించినటువంటి సినిమాపై ప్రేమలు పెంచుకున్న కారణంగా స్త్రీ బలిగావడం మాత్రం అందరిని కలవరపరిచే సమస్య. గత సంవత్సరం ప్రపంచ కప్ సాధించిన సందర్భంలో భారత క్రికెట్ టీం ఢిల్లీలో ప్రధానిని కలిసి ఆ తర్వాత బొంబాయి సముద్ర ఒడ్డు మీదుగా భారీ ఊరేగింపుతో స్టేడియంలో సభ జరిపినప్పుడు సముద్రంలో పడి మృత్యువాత పడే అవకాశం పెద్ద మొత్తంలో ఉన్నట్లు అందరూ భయపడిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాలను కల్పించి ప్రజలను రెచ్చగొట్టి పిచ్చివాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి ఈ దుర్మార్గపు నీతిని, ఆ వర్గాలకు స్వేచ్ఛను ఎవరు కల్పించినారో చూడకుండా గుడ్డిగా నమ్మబలకడం అంటే తమ సామాజిక బాధ్యతను విస్మరించడమే.శాస్త్ర సాంకేతిక సామాజిక రంగాలలో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించినటువంటి సందర్భాలు బహు తక్కువ ఉంటే కొత్త కొత్త అన్వేషణలు సామాజిక సిద్ధాంతాల ప్రతిపాదనతో సమాజానికి ఉపయోగపడే కృషి చేసినటువంటి ఈ రంగాల ప్రముఖులకు ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం, బిరుదులు, పురస్కారాలు, ఆర్థిక సహకారం అంత పెద్దగా ఉండదు కానీ ఎవరికి పట్టని దేశానికి ఉపయోగపడని ప్రజాప్రయోజనంతో సంబంధంలేని ఈ రంగాలలో పనిచేసిన వాళ్లకు మాత్రం భారతరత్నలు ఇవ్వడం, పద్మశ్రీ పురస్కారాలతో పాటు అర్జున్ అవార్డులను ప్రధానం చేసి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం అంటే ఏ ప్రయోజనం కోసం ఏ స్వార్థం కోసమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు క్రీడా రంగానికి లేనటువంటి భారతరత్న సచిన్ టెండూల్కర్ కు ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మార్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే పాలకులకు కూడా కావలసినది పెట్టుబడుదారులు సంపన్నులు బడా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహమే తప్ప పేద వర్గాల గురించి నటువంటి పట్టింపు లేదు అని మనం ఎన్నో సందర్భాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి ? తోకి సలాటలో మృతి చెందిన రేవతి భర్త ఫిర్యాదు చేయడంతో ప్రదర్శన బాధ్యులతోపాటు హీరో అల్లు అర్జున్ ని కూడా అరెస్టు చేయడం కిందిస్థాయి కోర్టులో హైకోర్టులో పిటిషన్లు వేయడం అదే రోజు సాయంత్రం ఐదు గంటల సుమారులో హైకోర్టు మధ్యంతర బేలు ఇవ్వడం చకచకా సాగిపోయింది 13 డిసెంబర్ 2024 రోజున. సాంకేతిక కారణాల వలన ఉత్తర్వులు జైలర్కు అందని కారణంగా తెల్లవారి వరకు జైల్లో ఉండవలసి వచ్చినప్పటికీ సుమారు 19 గంటల హైడ్రామా ప్రపంచాన్నే కదిలించడం ఆశ్చర్యకరం .కానీ చనిపోయిన రేవతి గురించి ఆలోచించకపోవడం శోచనీయం. న్యాయం ఏరకంగా అరెస్ట్ అయిన కుటుంబానికి అండగా ఉన్నదో జరిగిన సన్నివేశాన్ని చూసే అందరికీ అర్థం అవుతూనే ఉంటుంది. అప్పటికే 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఆ కుటుంబానికి హీరో ప్రకటించి ఉన్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకో పోతుంది అనే నె పముతో అరెస్టు జరిగిన తీరు అలావుంటే రాష్ట్ర బిజెపి టీఆర్ఎస్ నాయకులు జాతీయ అవార్డు పొందినటువంటి హీరోను అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని ఘాటుగా విమర్శిస్తే, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఏ రకంగా సమంజసమో వారికే తెలియాలి. , ఇదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని తాను చేసుకుందని అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తుందని ప్రకటించడం మంచిదే కానీ అది నిరంతరం అన్ని వర్గాల పట్ల ఒకేలా కొనసాగాలని మాత్రం విశ్లేషకులు విమర్శకులు సూచిస్తున్నారు .సామాన్యుల జీవితాలు మృతి పట్ల సోయి లేని రాజకీయ పార్టీలు అరెస్టును ఖండించడం అంటే పెత్తందారి వర్గాలను ప్రోత్సహించడమే కదా! చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా నేరస్తులకు తగిన శిక్షణ విధించడం ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అని రుజువు చేయవలసిన అవసరం మిగిలే ఉన్నది.
ఇంతకు ఈ సినిమాలోని ప్రత్యేకత ఏమిటి:-
సమాజ హితాన్ని సాధించిపెట్టే దారిలో సాహిత్యం సినిమాలు ఉండాల్సిన అవసరం ఉంది కానీ దానికి భిన్నంగా అనేక సినిమాల లోపల కూడా కేవలం సమాజము ప్రజా జీవితంతో సంబంధంలేని కల్పిత కథలు, ప్రజా వ్యతిరేక అంశాలు, సంఘర్షణలు, వివాదాలకు తావిచ్చే కథలు చోటు చేసుకోవడం పైన అనేకమంది విమర్శకు దిగుతున్నారు .ఈ స్పృహ లేని, తందాన అంటే తానే తందాన అనే పద్ధతిలో కేవలం అనుకరణకు మాత్రమే పరిమితమైనటువంటి జనాన్ని ప్రలోభ పెట్టి ఇలాంటి సంఘటనలకు ముఖ్యంగా సినిమాలను క్రీడలను ప్రయోజనం లేనటువంటి షోలను ప్రోత్సహించడం పరిపాటిగా మారింది. ఆ క్రమంలోనే అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడం తాత్కాలికంగా చర్చ జరిగినప్పటికీ ఆ తర్వాత మర్చిపోవడం ఇదే కొనసాగుతున్న తంతు. ఇక కథ అంశానికి వచ్చినప్పుడు ఎర్రచందనం దొంగలను అటవీ పోలీసు అధికారుల కల్లుగప్పి ఇతర దేశాలకు పంపించడం ద్వారా సొమ్ము చేసుకోవడం స్మగ్లింగ్కు పాల్పడడం అధికారులు ప్రజాప్రతినిధులను లోపర్చుకోవడం ద్వారా హీరోఇజం అనిపించుకోవడం ఈ సినిమాలో ఉన్నట్టు గూగుల్, సినిమా చూచిన వాళ్లద్వారా తెలుస్తుంది. ఈ రకంగా సమాజ హితాన్ని కాంక్షించని జాతికి ద్రోహం తలపెట్టే కథకు ఆధిపత్యం వహిస్తూ హీరోగా నటించడం నిజంగా హీరోయి జం అవుతుందా? ఈ దేశంలో ప్రజలే నిజమైన ప్రతినిధులు, ప్రజలే నిజమైన హీరోలు, ప్రభువులు. ఓట్లు వేయించుకోవడం ద్వారా అధికారానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు ప్రజలను విస్మరించినట్లు సినిమాలు చూడడం ద్వారా ప్రజల నుండి కోట్లాది రూపాయలను జమ చేసి సొమ్ము చేసుకుని ప్రజలను గాలికి వదిలి తొక్కిసలాటలో చనిపోతే సానుభూతి చూపడం డబ్బులు కుమ్మరించడం ఇదేనా నిజమైన మానవత్వం? సమాజం ఆలోచించాలి. ఈ సంఘటన వంటి అనేక సంఘటనలు అనునిత్యం జరుగుతున్న గమనం నుండి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాలు తమ తమ తప్పిదాలను తప్పుడు అభిప్రాయాలను తప్పుడు ఆలోచనలు ఆచరణను సవరించుకోవడం ద్వారా ఇలాంటి దుష్ట సంస్కృతికి ముగింపు పలకాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )