ప్రతి నెల ఎన్సిడి టార్గెట్ ను పూర్తి చేయాలి :- ఎన్సిడి జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్
జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల:-జిల్లా కేంద్రం లోని డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం మాధుర్య ఆధ్వర్యంలో.. అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంలకు మరియు ఆశా కార్యకర్తలకు మూడు నెలలు ఏఎన్ఎం స్క్రీనింగ్ పూర్తి ఆయినందున స్క్రీనింగ్ నందు మిగిలి ఉన్న వారిని త్వరగా పూర్తిచేయాలని శ్యామ్ సుందర్ తెలిపారు.అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కూడా సంఖ్య పెరగాలని తెలిపారు.ఆఫ్ లైన్ రికార్డు నందు ప్రతి ఒక్కరు పేర్లు నమోదు అయి ఉండాలని. అందులో సస్పెక్టెడ్ వారిని గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, సుబ్బలక్ష్మి, లక్ష్మి, అబ్రహం, ఏఎన్ఎంలు అలివేలు, గ్రేస్, లక్ష్మీదేవి,మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.