చౌళ్ళరామారం గ్రామంలో సామాజిక నీటి కేంద్రం ఏర్పాటు చేసిన
మాజీ సర్పంచ్ కొమ్మిడి శకుంతల ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 06 మార్చి 2025 :- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌల్లరామారం గ్రామ పంచాయతీ సమీపంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని మాజీ సర్పంచ్ కొమ్మిడి శకుంతల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించడం జరిగినది. కార్యక్రమాని ఉద్దేశించి సమాజంలో త్రాగు నీటి వలన వచ్చే అనర్థాల గురించి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన మన గ్రామాల్లో కలుషిత నీటి వలన కాళ్లు కీళ్లనొప్పులతో పాటు తరచూ సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు.సమాజంలో నీటి కాలుష్యం వలన నూటికి ఎనభై శాతం ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని గ్రామాలలో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ద్వారా శుద్ధి చేసిన నీటిని గ్రామ ప్రజలకు అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ మంచినీటిని త్రాగి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటునట్లు ఆయన అన్నారు.కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులు చెవిటి శ్రీను,నాగరాజు,మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,పోగుల నర్సిరెడ్డి,బ్యాంక్ డైరెక్టర్ మెట్టు భాస్కర్ రెడ్డి,తోట భాస్కర్ రెడ్డి, తోట సుజాత,జ్యోతి,సాగర్ తదితరులు పాల్గొన్నారు పాల్గొనడం జరిగినది.