ఉపాధ్యాయులు తరగతికి సరిపడా ఉండాలి!

డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మైలారం సత్తయ్య
అడ్డగూడూరు 23 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జీవో 25 నిబంధనలను వెంటనే మార్చాలి అశాస్త్రిమైన ప్రక్రియను నిలుపుదల చేయాలి యాదాద్రి భువనగిరి తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి బోధన సరిగా జరిగే విధంగా చూడవలసిన బాధ్యత అందరిపై ప్రభుత్వందే దీనికి విరుద్ధంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు 11 నుంచి 60 మందికి ఇద్దరు విద్యార్థులు కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమై విషయం అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మైలారం సత్తయ్య అన్నారు.ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగూడురు మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయులను సంఘ సభ్యులుగా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిటిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బి. హన్మంతు అడ్డగూడురు మండల బాధ్యులు ఉప్పు నరేందర్ ఎస్. నిరంజన్ నరేష్ మరియు షబానా తదితరులు పాల్గొన్నారు.