యాదాద్రి నల్లగొండ జిల్లాలను  అనుసంధానం చేసే బస్సులు నడపాలి! 

Sep 24, 2024 - 09:08
Sep 24, 2024 - 09:10
 0  7

అడ్డగూడూరు 23 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని మానాయికుంట,గట్టుసింగారం, వెల్దేవి అడ్డగూడూరు మండల పరిసర ప్రాంత ప్రజలు
సోమవారం రోజు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కి గ్రామస్తులతో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
గత ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన మానాయికుంట గురజాల మూసి నది వంతెన పై ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక అడ్డగూడూరు శాలిగౌరారం మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్ కి విన్నవించారు.నకరేకల్ టు మోత్కూర్ వయా అడ్డగూడూరు బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తే మహాలక్ష్మి పథకంతో ఈ ప్రాంత ప్రజలకు కొంత వరికైనా ఉపయోగం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మానాయికుంట  గట్టుసింగారం వెళ్దేవి గ్రామస్తులు తరాల శ్రీశైలం, మేడబోయిన శ్రీను, కడారి శ్రీనివాస్, దేశమైన వీరయ్య, ఉప్పుల యాదయ్య, మంగళపల్లి లక్ష్మీనరసయ్య, చెరుకు నరసింహ, సోమయ్య  ఊట్కూరి శ్రీనివాస్, సాయిలు ఉప్పుల శాంతి కుమార్ ,చిప్పలపల్లి వంశీ, బన్నీ, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.