చక్ర స్నానంతో ముగిసినశ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు

Dec 17, 2024 - 16:56
 0  6
చక్ర స్నానంతో ముగిసినశ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు
చక్ర స్నానంతో ముగిసినశ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు

జోగులాంబ గద్వాల 17 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు కలియుగ దైవం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో ముగిశాయి. శ్రీ శేషదాసుల సన్నిధానం దీరేంద్ర దాస్ గృహంలో జరిగిన చక్రస్నాన కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. ఈనెల 5న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టాలు కళ్యాణోత్సవం తెప్పోత్సవం మహారథోత్సవ కార్యక్రమాలకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు సందర్శించుకొని స్వామివారికి , మ్రొక్కులు సమర్పించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ, ధర్మాదాయ, పోలీసు శాఖ, గ్రామపంచాయతీ, వైద్య, రవాణా శాఖలు ప్రత్యేక శ్రద్ధతో జాతరకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, మధుసూదనాచారి, భీమసేన చారి, రమేష్, రవి, రాఘవేంద్ర దాస్, ప్రహ్లాద చారి, ప్రమోద్ ప్రసన్న, పట్వారి అరవిందరావు, ధరూర్ శేషగిరి రావు,గట్టు మదు,నాగరాజు శర్మ, చంద్రశేఖర రావు, శశాంకదాస్,విష్ణు, వెంకోబారావు, సీతారాంరెడ్డి, మాదుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333