ప్రైవేటు వద్దు ప్రభుత్వ పాఠశాలలో ముద్దు

Mar 5, 2025 - 19:28
Mar 5, 2025 - 19:49
 0  24
ప్రైవేటు వద్దు ప్రభుత్వ పాఠశాలలో ముద్దు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రైవేటు వద్దు ప్రభుత్వ పాఠశాలలో ముద్దు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ప్రయత్నం.. ఆత్మకూర్ ఎస్. విద్యా సంవత్సరం ముగుస్తుందని ముందే ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆకర్షించేందుకు ఎన్నో రకాలుగా ఎర చూపుతున్న నేటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు సొంత ఖర్చులతో పెన్నులు, పెన్సిల్లు, బహుమతులు అందజేస్తూ అవగాహన కల్పిస్తున్న సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి లో 26 మంది విద్యార్థుల కు 6వ తరగతి కి ప్రైవేట్ స్కూల్ కి మరియు ఏ ఇతర హాస్టల్స్ కి వెళ్ళవద్దు అని,అన్ని వసతులు మన ఊరిలో నీ ఉన్నత పాఠశాల లో ఉన్నాయని,ZPHS ఆత్మకూర్ ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ ఉపాధ్యాయులు కోరారు. అందరు సీనియర్ టీచర్స్ మీకు భోధన చేయడానికి సిద్ధంగా వున్నామంటూ పిల్లల కు మోటివేషన్ చేసి ఉచితంగా పుస్తకాలు బట్టలు ఇప్పిస్తామంటూ పిల్లల కు నచ్చ చెప్పారు .ZPHS ఆత్మకూర్ పాఠశాల కు వచ్చే ఏడాది 6 వ తరగతి కి రావాలని పిల్లలకు ఉపాధ్యాయులు స్వంత ఖర్చులతో విద్యార్థుల కు పెన్నులు బహుకరించారు.