MLA కసిరెడ్డి వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనానికి ప్రమాదం జరిగింది. తలకొండపల్లి మండలం వెలిజాల గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్ ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి.
కారులో హెయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే కసిరెడ్డికి ప్రాణాపాయం తప్పింది. MLA ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.