ఆసాంఘిక కార్యక్రమాలు హద్దు మీరుతున్న వేళ కొత్త సంవత్సర వేడుకలపై ఉక్కు పాదం మోపాల్సిందే

Apr 7, 2024 - 18:47
 0  0

హైదరాబాదు నగరానికి పరిమితం కాకుండా  నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి .

హింస ప్రవృత్తిని, అశ్లీల సంస్కృతిని, యువతను నిర్వీర్యం చేసే ఈ వేడుకలతో ఉద్ధరించేదేమున్నది?

--వడ్డేపల్లి మల్లేశం

నూతన సంవత్సర వేడుకలు జరగనున్న  31 డిసెంబర్ నాటికి  పది రోజుల ముందే ప్రభుత్వం  పోలీసు వ్యవస్థ  క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లను నిర్వహించే  బార్ అండ్ రెస్టారెంట్ల  నిర్వహణ పైన  నిబంధనలు విధించినట్లు తెలుస్తున్నది .అయితే  మొక్కుబడి నిబంధనలతో ప్రయోజనం లేకపోగా పరోక్షంగా పెట్టుబడిదారులకు, కార్యక్రమ నిర్వాహకులకు, మద్య దళారులకు ఉపయోగపడే ఏ రకమైన చర్యలు కూడా  ప్రజలకు ఉపయోగపడకపోగా  ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంటుంది.  కనుక అధికారులు పోలీసులు విధించిన నిబంధనలను  ప్రభుత్వ ప్రతినిధులు  గమనిస్తే మంచిది.  ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కోణంలో  సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు గు ప్పించడంతోపాటు  గ్రేటర్ పరిధిలోని కొన్ని రిసార్ట్స్ ఫామ్ అవుజులు పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి పోలీసులకు చిక్కి న సందర్భాలున్నట్లు అధికార యంత్రాంగం  తెలియచే స్తున్నది.  ముఖ్యంగా మాదకద్రవ్యాలకు,  మత్తు పదార్థాలకు,  ఇతరత్రా అశ్లీల అర్థనగ్న శృంగార ప్రదర్శన కార్యక్రమాలకు  అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు  ముమ్మరం చేసినట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తున్నప్పటికీ  విధించినటువంటి నిబంధనలు గనుక పరిశీలించినప్పుడు  అవి ఏరకంగానూ  అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోవచ్చు అని తెలుస్తుంది.

     ఈ కార్యక్రమాలు నిర్వహించే హోటల్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు ,పబ్బులు  31వ డిసెంబర్ నాడు  రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి అని నిబంధన ఉంది.  ప్రభుత్వం విధించిన నిబంధనే ఒంటిగంట వరకు ఉంటే  నిర్వాహకులు మరింత పెంచుకోవచ్చు,  పాల్గొనే యువత మరింత  ఉత్సాహంతో  కార్యక్రమాలను గనుక కొనసాగిస్తే  సుమారు తెల్లవారే వరకు ఇవే కార్యక్రమాలు కొనసాగవచ్చు . తత్ పరిణామంగా అనేక   సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదముంది. తెల్లవారి పత్రికల్లో  కొత్త సంవత్సర సందర్భంగా మద్యం విక్రయాల భారీ జోరు అని ప్రకటనలు రావడానికి మాత్రమేనా?  ఈ నిబంధనలు అని  ప్రజలు ప్రశ్నించక ముందే నిర్వాహకులు, పోలీసు యంత్రాంగం  పెద్ద మొత్తంలో పరిమితి విధించడం ద్వారా  పెడదారి పట్టకుండా చూస్తే మంచిది . ఇక -రెండవ నిబంధన 10 రోజులకు ముందే  నగర పోలీసులు ఇతర శాఖల అనుమతులు తీసుకోవాలని  శరత్ విధించినారు  ఈ నిబంధనలు కేవలం నగరానికి మాత్రమే  వర్తిస్తే రెండవ శ్రేణి మూడవ శ్రేణి పట్టణాలు ఇతర  ప్రాంతాల సంగతి ఏమిటి అనే విషయాన్ని కూడా  ప్రభుత్వం ప్రకటిస్తే మంచిది.  ---ఉత్సవాల నిర్వహణ ప్రదేశాలలో  సీసీ కెమెరాలు , సరిపడినంత భద్రతా సిబ్బంది ,ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని నిబంధన ఉంది.  ఇన్ని ఏర్పాట్ల తోని ఈ ఉత్సవాలను నిర్వహించడం అవసరమా? అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే మంచిది. -- సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అసభ్య అశ్లీల శృంగార నృత్యాలు నిర్వహిస్తే  చర్యలు తప్పవు అని మరొక నిబంధన తెలియజేస్తుంటే  గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు కొనసాగుతూ ఉంటే ఏనాడు కూడా అదుపు చేసిన దాఖలా లేదు.  కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఇతర మాఫియాల మీద ఉక్కు పాదం మోపడానికి సిద్ధపడిన వేళ కూడా  కొత్త సంవత్సర సందర్భంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తే తప్పేమిటి? అని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  -,టపాసులు, బాణసంచా,  పేలుడు పదార్థాలను  ప్రయోగించకూడదని  నిబంధన ఉన్నప్పటికి  గ్రామాల నుండి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా ఇలాంటి కార్యక్రమాలు గతంలో కొనసాగినవి.  ఈ నిబంధనలను అమలు చేసే యంత్రాంగం  మరింత దృష్టి సారిస్తేనే  ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యమైన నూతన సంవత్సర ఆరంభాన్ని తిలకించడానికి అవకాశం ఉంటుంది.

 సామూహికమైనా  వ్యక్తిగథా నికి పరిమితం చేసుకుంటే మంచిది :-

మానవుడు సంఘజీవి కనుక  ప్రతి సందర్భాన్ని ఉమ్మడిగా స్నేహితులతో  పరిచయం ఉన్న వాళ్లతో  పంచుకుంటే తప్పులేదు. కానీ నూతన సంవత్సర ప్రారంభం పేరుతో కొనసాగే  అసాంఘిక  కార్యక్రమాలలో మద్యం మత్తు పదార్థాల కారణంగా  తప్పుదారి పట్టే ప్రమాదముంది. దాని పరిణామాలు గతంలో మనమందరం చూసినదే.  స్నేహితులతో  కుటుంబ సభ్యులతో  కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది అదే సందర్భంలో  ప్రభుత్వం కూడా  ఇలాంటి నిర్వహణ సంస్థలను  పూర్తిగా అణచివేసినప్పుడు మాత్రమే  ఎలాంటి  గందరగోళం ప్రమాదాలు ఇబ్బందులు లేకుండా  ఈ తంతు కొనసాగే అవకాశం ఉంటుంది.  ఇప్పటికీ  రాష్ట్రవ్యాప్తంగా బార్లు రెస్టారెంట్లను అనుమతించి,  మద్యం త్రాగడాన్ని ప్రోత్సహించి, అందులో నుండి బయటికి రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో అరెస్టు చేయడం  జరిమానాలు విధించడం ద్వంద  ప్రమాణాలకు నిదర్శనం కాదా?  ప్రస్తుతం విధించిన నిబంధన ప్రకారం  వాహనాలు నడిపేటప్పుడు రక్తంలో మద్యం నిర్ణీత మోతాదు గనుక మించినట్లయితే కేసు నమోదు చేస్తారని  తెలియజేయడంలో ఔచిత్యం ఏమున్నదో అర్థం కాదు.  అందుకు 10,000 జరిమానా ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చునని  చట్టం చెబుతుంటే  ఈ నిబంధనలను ప్రతి ఈవెంట్ నిర్వాహకుడు ప్రధాన ద్వారం వద్ద ప్రదర్శించాలని  పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్లుగా తెలుస్తున్నది  .అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చట్టానికి ,న్యాయానికి, మానవ  ప్రవర్తనకు భిన్నమైన  రీతిలో ఉంటే వాటిని పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వము పోలీసులు అనుమతించి నిబంధనల పేరుతో  కట్టడి చేసినట్లు  ప్రకటించడంతో  నేరాలను అరికట్టడానికి ఆస్కారం లేకపోగా  మద్యాన్ని మత్తును అశ్లీల ప్రదర్శనలను నిర్వహించడానికి పరోక్షంగా ప్రోత్సహించిన ప్రభుత్వంగా  ముద్ర పడే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!  గతంలో కొనసాగినవాటిని   కొనసాగనివ్వకూడదని  మద్యం మత్తు లేనటువంటి కొత్త సమాజాన్ని ఆవిష్కరించాలని ఇటీవల జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడం  అందరం గమనించి ఉన్నాం . అలాంటప్పుడు ఆ ప్రకటనకు అనుగుణంగానే నిర్వహణ ఉండాలి కానీ తాత్కాలికంగా నూతన సంవత్సర వేడుకలకు నిబంధనల పేరుతో అనుమతించి  సామాజిక అశాంతికి కారణం కాకూడదని  ప్రజలు హెచ్చరిస్తున్నారు.

ఈ పేడ ధోరణి గ్రామం స్థాయి నుండి హైదరాబాద్  నగరం వరకు  అన్ని రాష్ట్రాల్లోనూ దేశ రాజధాని ఢిల్లీ వరకు ఎగబాకుతున్నటువంటి సందర్భంలో  అన్ని రాష్ట్రాలతో కేంద్రం ఉమ్మడిగా చర్చించాలి.  మద్యాన్ని, మత్తును, ధూమపానాన్ని, ఇతర పబ్బులు క్లబ్బులలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను ఉక్కు పాదం మోపి అణచివేయాలి.

 ప్రజలు ప్రశాంతమైన, ఆనందదాయకమైన, ఆరోగ్యమైన,  సంతృప్తికరమైన , పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందే  హక్కును కోరుకున్నారు. కానీ  మూర్ఖత్వంతో ప్రభుత్వమే, అధికారులే ప్రజలకు అలవాటు చేసే దుష్ట సంప్రదాయానికి ఇకనైనా  చరమగీతం పాడితే మంచిది .అందులో కోటి ఆశలతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేల  కఠిన నిర్ణయాలతో పాటు అమలు చేసే సందర్భంలో  తొలిసారిగా వచ్చిన అవకాశం కొత్త సంవత్సర వేడుకలపై  ఉక్కు పాదం మోపడం ద్వారా తన నిబద్దతను, చిత్తశుద్ధిని, నిజాయితీని, సమర్ధతను, ప్రతిభను చాటుకోవాల్సిన అవసరం ఉంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333