భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల కు దక్కిన అరుదైన గౌరవం.

Apr 2, 2025 - 17:52
Apr 2, 2025 - 17:53
 0  89
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల కు దక్కిన అరుదైన గౌరవం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల కు దక్కిన అరుదైన గౌరవం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల కు దక్కిన అరుదైన గౌరవం. యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడ్డారు. ఈనెల గత వారం రోజులుగా పాల్వంచలో జరుగుతున్న, తెలంగాణ రాష్ట్ర యువతరం పార్టీ మహాసభలకు, రాష్ట్రం నలుమూలల నుండి ఇరు రాష్ట్రాల నుండి హాజరైన కార్యకర్తలు, పెద్దలు, రాజకీయ నాయకులు, అందరి సమక్షంలో అందరి మన్ననలతో, ఎన్నో ఏళ్లగా ప్రజాసేవలో నిమగ్నమై, నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాను ఉన్నానని ధైర్యం ఇస్తూ, ముందుకి తీసుకెళ్తూ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన, ప్రముఖ సామాజిక సేవకర్తగా గుర్తింపు పొందిన, అలాగే *భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైన మరియు జాతీయ మానవ హక్కుల సంఘం ఇరు రాష్ట్రాల అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా పని చేస్తూ ఎంతోమంది రాజకీయ పట్టణ అధికార ప్రముఖల ద్వారా మన్ననలు పొందిన మన సుపరిచితుడైన గుజ్జుల వేణుగోపాల్ రెడ్డికి యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి మరెన్నో బాధ్యతలను అప్పగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ జాతీయ అధ్యక్షుడైన పొట్రు ప్రవీణ్ కుమార్ మరియు వివిధ జిల్లాల అధ్యక్షుల సమక్షంలో ఈ సమకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని, యువతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటు ప్రవీణ్ కుమార్ తెలిపాడు.

వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల మాట్లాడుతూ ఈ పదవి ఎన్నో బాధ్యతలతో కూడిన ఒక పరీక్షగా తీసుకొని, నా బాధ్యత నేను నిర్వహిస్తానని అంతఃకరణ శుద్ధితో పార్టీని పార్టీ సిద్ధాంతాల్ని, ముందుకు తీసుకెళ్తానని పార్టీ పెద్దలు మరియు ప్రముఖులు అందరికీ తెలియజేయడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే, ఈ యువతరం పార్టీ ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలను బలపరచడమే, నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఒక ఉపాధ్యాయుని పదవితో సమానమని ఆ ఉపాధ్యాయుడు ఎంతోమంది నాయకులను ప్రముఖులను పెద్దలను అధికారులను క్రమశిక్షణలో ఉంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా తయారు చేసినట్లుగా, నేను నా పదవిని దుర్వినియోగం చేయకుండా నా మనస్ఫూర్తిగా నా సహోదయంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలు లను బలపరచడమే, నా ముఖ్య లక్ష్యమని అని తెలిపారు .యువతరం పార్టీ మీ అందరి కోసం ఎదురుచూస్తుందని ఇతర రాజకీయ పార్టీలో గా కాదని ఇది ఒక మార్పు తీసుకొచ్చే పార్టీగా అవతరించిందని తెలిపారు. 

యువతరం పార్టీ అందర్నీ ఆదరిస్తుందని అందర్నీ ఆహ్వానిస్తుందని ఇతర పార్టీలో గాని సమాజంలో గాని గుర్తింపు లేకపోవడం గాని మీరు పడుతున్న కష్టాన్ని వృధా అవుతుందా అయితే మా యువతరం పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మీ రాక కోసం ఎదురు చూస్తుందని రాబోయే సార్వత్ర ఎన్నికల్లో బరిలో దిగి గెలుపు జెండా ఎగరేస్తుందని స్థానిక ఎన్నికల్లో గెలుపొంది పేద ప్రజలకు అండగా నిలుస్తుందని జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతుందని అధికారులతో మాట్లాడి పేదలకు దక్కాల్సిన ప్రతీది దక్కే విధంగా చూస్తుందని తెలిపారు.

ఈ మహాసభలో ఎన్నో ముఖ్య సమస్యలను గురించి చర్చించి అందరితో మాట్లాడి జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసి సమాజ సేవ చేసే వారందరినీ ఒక ఐక్యవేదిక చేసి బరిలో దిగి వారి సత్తా చూపించి గెలుపొంది నిజమైన రాజ్యాంగబద్ధమైన పరిపాలనను తీసుకొస్తానని యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల తెలిపారు. 

ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించి బడుగు బలహీన వర్గాలను బలపరిచి వారిని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉన్నత స్థాయికి చేర్చే విధంగా నా లక్ష్యాన్ని నేను నిర్వహిస్తానని నా శ్రేయోభిలాషులకు నా పార్టీ కార్యకర్తలకు నా పార్టీ నాయకులకు మాటిస్తున్నానని తెలిపారు. మన యువతరం పార్టీ ముఖ్య లక్ష్యం ఏంటంటే బడుగు బలహీనవర్గాలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని, మన ఆకలి గూడు ను అసెంబ్లీలో వినిపించాలని, మనకి జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అరికట్టాలని, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని, న్యాయబద్ధంగా తుడిచి పెట్టాలని, పార్టీలో బరిలోకి దిగబోయే వారిలో 70 శాతం మంది బడుగు బలహీన వర్గాలను ఉంటారని మాటిస్తున్నాము. 

బడుగు బలహీన వర్గాల నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి రాజకీయపరమైన శిక్షణ అందించి రాజకీయ బద్దంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాన్ని ఏలడం నేర్పిస్తానని యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల మాటిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు లో విద్య, వైద్యం, త్రాగునీరు, పోడు భూమి, ఉద్యోగం, పేదరికం, ఆకలి చావులు, కార్మికుల, ప్రజలు మనుగడకై ఆర్థిక పరమైన సమస్యలను అరికట్టాలని,

అధికార, ప్రతిపక్ష పార్టీలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసిందేంటనేది, ఇన్నాళ్లు పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకు జరిగిన మేలు ఏంటి అనేది రాజకీయ యుద్ధ భూమిలో తేల్చుకుందామని తెలంగాణ రాష్ట్ర యువతరం పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333