అడ్డగూడూరు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థుల ఆహారాన్ని పరీక్షిస్తున్న ఎంపీఓ ప్రేమలత
అడ్డగూడూరు 30 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదేశాల మేరకు విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరీక్షిస్తున్న ఎంపివో హేమలత సోమవారం రోజు పాఠశాలను సందర్శించి వంటశాలలో ఆహారాన్ని ఎలా ఉందని పరీక్షించారు.విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వారు హెచ్చరించారు. విద్యార్థినీ విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కార్యాలయం సిబ్బంది జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.