ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఐజ అఖిలపక్ష కమిటీ ఘన నివాళి
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో KBS బ్యాంకు దగ్గర, (జ్యోతిబాపూలే సర్కిల్) ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతిని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు బాపూజీ గారి గురించి ఆయన గొప్ప సేవలు గురించి కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర పాలకుల కుట్రలు నచ్చక 1969 తెలంగాణ పోరాటంలో భాగస్వాములై రజకారులు ఎదిరించి ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన 90 వయసులో కూడా మలిదశ ఉద్యమంలో పాల్గొని నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చారని తెలిపారు.
మలిదశ ఉద్యమంలో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున చలికాలంలో కూడా తెలంగాణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పోరాటంలో కీలకపాత్ర వహించారని తెలిపారు. తెలంగాణ కొరకు తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన సందర్భం అని ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో ఉద్యమంలో పాలుపంచుకున్న ఐజ PGK వెంకటేశ్వరరావు గారు తనకున్న అనుభవాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుర్ని కుల సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఐజ అఖిలపక్ష కమిటీ నాయకులు, మీడియా మిత్రులు పాల్గొని విజయవంతం చేశారు.