నియమ నిబంధనలు పాటించకుండా ఓపెన్ బ్లాస్టింగ్
ఊరికి కూతవేటు దూరంలోనే మైనింగ్ బ్లాస్టింగ్ తో గుండ్లపల్లి గ్రామస్తుల ఇండ్లలో గోడలకు పగుళ్లు
భయంతో గ్రామస్తులు చిన్న పిల్లలు ఒకవేళ బ్లాస్టింగ్ లైసెన్స్ తో చేయాలంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్వారీ దగ్గర సేఫ్టీ సెంట్రి రూము ఎర్పాటు బ్లాస్టింగ్ చేసే ప్రతిరోజు దానికి సంబంధించిన సామాగ్రి మరియు రోజువారి బ్లాస్టింగ్ లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాలి వివరాల్లోకెళితే మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెం గుండ్లపల్లి గ్రామాల మార్గమధ్యంలో లలిత సిమెంట్ కర్మాగార ముందర గ్రామానికి అతి సమీపంలో కృష్ణా బ్యాక్ వాటర్ కు 100 అడుగుల దూరంలో ప్రభుత్వ భూమిలో ఓపెన్ బ్లాస్టింగ్ జరుగుతుంది.ఆ ఓపెన్ బ్లాస్టింగ్ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ప్రతిరోజు ఓపెన్ బ్లాస్టింగ్ చేయడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు ఇండ్లలోని గోడలు పగుళ్ళతో మరియు ఇంట్లో ఉన్న సామాన్లు క్రింద పడుతున్నాయని ఇంట్లో ఉన్న చిన్నచిన్న పిల్లలు, ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యితున్నారు.మరో విషయం ఏమిటంటే పశువుల కాపరులు గొర్రెల కాపరులు అటు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు ఎప్పుడు బాంబులు పేల్చుతారో ఎవరికీ తెలియదు పంట పొలాల ఆ పరిదిలో పని చేయాలన్న రైతులకు కూలీలు కూడా రాని పరిస్థితి ఒక వేళ పని చేస్తున్న కూలీలు భయం గుప్పిట్లో పెట్టుకొని పనిచేయాలి పులిచింతల ముంపు క్రింద కూడా అట్టి భూమి రైతుకి నష్టపరిహారం కూడా అందిందని అక్కడ గ్రామస్తుల సమాచారం ఏదిఏమైనా వెంటనే అక్రమ అనుమతులు లేని బ్లాస్టింగ్ నేను నిలుపుదల చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.