నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్

సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు

Apr 15, 2025 - 07:56
 0  7
నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్
నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్

Hyderabad News  

నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్

సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు 

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్

అంబేద్కర్ కు ఘన నివాళి జగిత్యాల , 

కోరుట్ల పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద మహానేత భారతరత్న డా|| బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.అన్ని సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని, నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని టైగర్ అలీ నవాబ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, మహనీయుని ఆశయ సాధన కోసంఅందరూపాటుపడాలని , ఆ మహానేత కన్న భారతావని కోసం కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడనికొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలపై సామాజిక, కుల వివక్షను అంతం చేయడానికి నిరంతరం కృషి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆ మహానుభావుడు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని గుర్తుచేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి తొలి న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మన దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, వారి ఆర్థిక స్థితిని పెంచడం. భారతదేశం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానికి "విద్య - ఉద్యమించు - సంఘటితం" అనే నినాదంతో ఆయన ఒక సామాజిక ఉద్యమాన్ని కూడా నడిపించారని తెలిపారు. అందరు మానవుల సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని ఆయన కోరుకున్నారని అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని, ఐక్య రాజ్య సమితి అతన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా ప్రకటించిందని, అందరూ అతను చూపినా బాటలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మణి సాక్షి పత్రిక ఎడిటర్ శంకర్ గౌడ్ కృష్ణారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333