**డ్రగ్స్ నివారణలో విద్యార్థులు ఫ్రంట్ లైన్ వారియర్ లాగా ఉండాలి""ఎస్ఐ సురేష్ రెడ్డి, పాలక వీడు పిఎస్*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలక వీడు : డ్రగ్స్ నివారణలో విద్యార్థులు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా ఉండాలి - సురేష్ రెడ్డి SI పాలకవీడు.
ఈనెల 26 వతేది మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాటి అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాల సందర్బంగా ఈరోజు పాలకవీడు ఎస్సై మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు డ్రగ్స్ నిర్మూలన, యువత పై వాటి ప్రభావం, విద్యార్థుల భవిష్యత్తు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై గారు మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు, మంచి సమాజ నిర్మాణంలో యువత, విద్యార్థుల పాత్ర చాలా ఉంటుంది అన్నారు. అలాంటి కొంతమంది యువత, విద్యార్థులు సరదాకోసం వ్యసనాలకు, డ్రగ్స్ కు అలవాటు అలవాటు పడి మంచి భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారు అన్నారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల సమాజంలో అలజడి వాతావరణం ఏర్పడుతుందని డ్రగ్స్ మత్తులో నేరాలకు కూడా వెనకాడరని అన్నారు, డ్రగ్స్ నిర్మూలించడంలో విద్యార్థులు యువత ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి వాటి నిర్మూలనకు ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.