అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందించాలి
నిడమనూరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసిం
తెలంగాణవార్త జనవరి 22 మాడుగులపల్లి; మాడుగులపల్లి మండల పరిధిలోని గ్రామాలలో సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా వాటి ఎంపిక కొరకు నిర్వహిస్తున్న గ్రామసభలో అధికారులు అంతా గందరగోళం సృష్టించి కాంగ్రెస్ కార్యకర్తలను అర్హులుగా గుర్తిస్తున్నారని నిజమైన పేదలకు అర్హులను లబ్ధిదారుల జాబితాలో లేకుండా చేసి వారికి అన్యాయం చేస్తున్నారని నిడమనూరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరోపించారు.లబ్ధిదారుల ఎంపిక అనేది పారదర్శకంగా జరిగేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకొవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అధికారులు కాకుండా అనర్హులకు సంక్షేమ పథకాలు అందించినట్లయితే మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని అర్హులతో కలిసి ప్రజాక్షేత్రంలో అధికార ప్రజాప్రతినిధులను అధికారులను నిలదీసి దోషులుగా నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని హెచ్చరించారు.