పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి

May 19, 2025 - 20:49
 0  9
పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి

జోగులాంబ గద్వాల్ 19 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: మల్దకల్. మండలం మద్దెలబండ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రైతు సౌటిబావి నరసింహులుకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. వీటి విలువ అందజా లక్షా ఇరవై వేలు ఉండొచ్చని రైతు తెలిపాడు. రైతు కుటుంబానికి జీవనదారమైన రెండు కాడెద్దులు మృతి చెందడంతో లబోదిబో మని బోరున విలపించాడు. అట్టి రైతును విపత్తుల నష్టపరిహారం క్రింద ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333