అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దాడిని ఖండించిన పాస్టర్స్ .

Feb 11, 2025 - 19:41
Feb 11, 2025 - 21:00
 0  1
అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దాడిని ఖండించిన పాస్టర్స్ .

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దాడిని ఖండించిన పాస్టర్స్ ....* ఆత్మకూరు ఎస్.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై మతం ముసుగులో కొందరు దుండగులు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవరెండ్ డా.జలగం జేమ్స్ లు తెలిపారు.మంగళవారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని పాస్టర్ రెవరెండ్ తాడంకి కిరణ్ బాబు ఇమ్మానియెల్ ప్రార్ధన మందిరంలో జరిగిన సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు.ఈ దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నట్లు తెలుపుతూ అన్నీ మతాలవారు ముక్తా కంఠంతో దీనిని ఖండించాలని అన్నారు.రంగరాజన్ పై సుమారు 20 మంది దాడి చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారని,వారిని త్వరగా పట్టుకొని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.మత సామరస్యాన్ని కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని,దాన్ని బ్రష్టు పట్టించే ఎంతటి వారి పైనైనా ఉపేక్షించేది లేకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సమావేశంలో ఫాస్టర్స్ పెలోషిప్ గౌరవ సలహాదారులు బొక్క ఏలియా రాజు,పెన్ పహాడ్ మండల అధ్యక్షులు రెవ.జాన్ ప్రకాష్,రెవ.పివి బోయాజ్, రెవ.బానోత్ సుధాకర్,పాస్టర్స్ బొప్పాని అన్వేష్,పుల్లూరు మహేందర్,మల్లేపల్లి ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు.