అల్లంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల చిరకాల కోరిక నెరవేరింది

మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు అల్లంపూర్ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి ధన్యవాదములు అలంపూర్ నియోజకవర్గ ప్రజలు
జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి. మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిఫ్టు కింద అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లంపూర్ నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దశబ్ద కాలంలో ఆర్డీఎస్ రైతులు పడ్డ కష్టాలను చూసి చలించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గత ప్రభుత్వంపై పోరాటం చేసి ఆర్డీఎస్ రైతులతో భారీ ఎత్తున సింధనూరు దగ్గర దీక్ష చేసి అప్పుడు తుమ్మిల లిఫ్ట్ సాధించడం జరిగింది. ఇప్పుడు పట్టు వీడనీ విక్రమార్కుడిల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మల్లమ్మ కుంట రిజర్వాయర్ అనుమతి ఇప్పించినందుకు సంపత్ కుమార్ కి అల్లంపూర్ నియోజకవర్గం రుణపడి ఉంటాం.