ఆటో చెట్టుకు ఢీకొని ఒకరు మృతి ఇద్దరికీ గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ ఆటో చెట్టుకు ఢీకొని ఒకరు మృతి ఇద్దరికీ గాయాలు* ఆత్మకూర్ ఎస్. మండల పరిధిలోని ఏనుబాముల శివారు సంతోష్ మాత ఆలయం సమీపంలో సూర్యాపేట నుండి నెమ్మికల్ వైపు వస్తున్న ఆటో అతివేగం కారణంగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏనుబాముల గ్రామానికి చెందిన వర్రె మల్లమ్మ, గొర్రె పార్వతమ్మ తమ బంధువుల దశదినకర్మకు సూర్యాపేట మండలం ఆరెగూడెంకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ సూర్యాపేట నుండి తమ స్వగ్రామం వచ్చేందుకు నెమ్మి కల్ కు చెందిన మోరపాక వెంకన్న ఆటో ఎక్కారు .మరో రెండు నిమిషాల్లో తమ గ్రామం ఏనుబాముల స్టేజి వద్ద ఆటో దిగాల్సి ఉండగా ఆటో చెట్టుకు ఢీ కొట్టడం తో వర్రె మల్లమ్మ 70. అక్కడికక్కడే మృతి చెందగా వర్రె పార్వతమ్మ కు, ఆటో డ్రైవర్ మోరపాక వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన మల్లమ్మ ను పోస్టుమార్టం కోసం సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించారు. మృతురాలు మల్లమ్మ కుమారుడు వర్రే రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. మృతురాలు మల్లమ్మకు ఒక కొడుకు కూతురు ఉన్నారు.