అధికార యంత్రాంగం అలసత్వం వీడి వెంటనే చర్యలు చేపట్టాలి

Aug 13, 2024 - 16:04
Aug 13, 2024 - 21:36
 0  2
అధికార యంత్రాంగం అలసత్వం వీడి వెంటనే చర్యలు చేపట్టాలి

మునగాల 13 ఆగస్టు  2024

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ 

తెలంగాణవార్త ప్రతినిధి :-గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల గ్రామంలోని పరిసర ప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణంతో దోమల ఈగల వ్యాప్తి తో గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ మంచం పడుతున్నారని తక్షణమే అధికార యంత్రాంగం అలసత్వం వీడి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పలు వీధుల్లో వారు ప్రత్యక్షంగా పర్యటిస్తూ స్థానిక ప్రజలు పడుతున్న అనారోగ్య సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు,

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునగాల గ్రామం మొత్తం ఏ వీధిలో చూసిన చెత్తాచెదారం డ్రైనేజీ మురుగు కాలువల నీరు నివాసగృహాల్లోని వ్యర్థపు నీరు మరియు వర్షపు నీరు నిల్వ ఉండి వాటిల్లో చెత్తాచెదారం దోమలు ఈగలు విజృంభిస్తూ అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉన్నదని తద్వారా నివాస గృహాల్లోకి ఈగలు దోమలు విపరీతంగా రావడం మూలాన గ్రామంలోని ఏ ఇంట చూసినా చికెన్ గునియా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాల సోకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజన్లో అపరిశుభ్ర వాతావరణం తో వచ్చే సిజినల్ వ్యాధులు అరికట్టడంలో మరియు దోమల మందు పిచికారి ,డ్రైనేజీ వ్యవస్థని పరిశుభ్రం చేయించడం, మురికి కాలువల్లో చెత్తాచెదారం ఎత్తి వేయించడం , బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంలో స్థానిక అధికార యంత్రాంగం అలసత్వం మూలాన నేడు గ్రామంలో ఎక్కడ చూసిన అనారోగ్యంతో మంచం పడుతున్న నివాసాలే కనిపిస్తున్నాయని ఇప్పటికైనా తక్షణమే, స్థానిక అధికార యంత్రాంగం స్పందించి గ్రామంలోని ప్రతి వీధిలో మరుగు కాలవని పరిశుభ్రం చేయించాలని చెత్తాచెదారం ఎత్తివేంచి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ గ్రామం మొత్తం దోమల మందు పిచికారి చేయడం ప్రతి ఇల్లు జరపీడితుల సర్వే చేసి వారికి తగిన మందులు పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టాలని లేని ఎడల తాము ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాల్సి వస్తుందని వారు తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State